PM Modi: మత ప్రాతిపదికన కాంగ్రెస్ రిజర్వేషన్ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందని, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్‌కి వెన్నుపోటు పొడవడమే అని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం కాంగ్రెస్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. అంబేద్కర్ ఇలాంటి చర్యల్ని వ్యతిరేకించారని మోడీ అన్నారు. ఇటువంటి రిజర్వేషన్లను రాజ్యాంగం స్పష్టంగా నిషేధిస్తోందని చెప్పారు. మధ్యప్రదేశ్ లోని సాగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీ కోటాలో ముస్లింలను చేర్చే ప్రతిపాదను తీసుకువచ్చిందని, కాంగ్రెస్ ఓబీసీలకు పెద్ద శతృవుగా మారిందని, మీ భవిష్యత్ తరాలను నాశనం చేసే ఆట ఆడుతోందని దుయ్యబట్టారు.
మతం ఆధారంగా రిజర్వేషన్లను మన రాజ్యాంగంలో స్పష్టంగా నిషేధిస్తుంది, బాబాసాహెబ్ దీనికి వ్యతిరేకమని, కానీ కాంగ్రెస్ దీనికి పూర్తి విరుద్ధంగా ప్రజలను మోసం చేయడానికి ఆట ఆడుతోందని ప్రధాని మోడీ మండిపడ్డారు. 2009, 2014 ఎన్నికల్లో కూడా తమ మేనిఫెస్టోలో మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల 15 శాతం కోటాని తగ్గించి మతం ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందని ప్రధాని మోడీ ఆరోపించారు.
Read Also: UK Army: రద్దీ రోడ్లపై ఆగకుండా పరుగులు పెట్టిన ఆర్మీ గుర్రాలు.. వీడియో వైరల్..
దేశాన్ని బలహీనపరిచేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని ఆరోపించిన ఆయన.. అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించడాన్ని ఉదహరించారు. ‘‘దేశ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ద్వేషిస్తోంది. వారు భారతదేశాన్ని ద్వేషిస్తున్నారు. దేశాన్ని బలహీనపరిచేందుకు అన్ని పనులు చేస్తున్నారు. సమాజంలో పోరాటాన్ని ప్రేరేపించేందుకు కొత్త మార్గాన్ని వెతుకుతున్నారు. అయోధ్యంలో రామమందిర ప్రాణప్రతిష్టం కార్యక్రమంలో కాంగ్రెస్ ఏం చేసిందో దేశం అంతా చూసింది. రాముడు ఊహాత్మక వ్యక్తి అని కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించింది’’ అని ప్రధాని అన్నారు.
మరోవైపు శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ఇప్పుడు మరో రహస్య ఎజెండాను ముందుకు తీసుకువచ్చింది. వారసత్వ పన్నులు విధిస్తామని కాంగ్రెస్ అంటుందని, తల్లిదండ్రుల నుంచి పొందే వారసత్వంపై కూడా పన్ను విధిస్తామని కాంగ్రెస్ చెబుతోందని ప్రధాని అన్నారు. మీరు కష్టపడిన సొమ్మును లాక్కునేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని, మీరు మీ పిల్లలకు ఇవ్వాలని కూడబెట్టిన సొమ్మును లాక్కోవాలని ప్రయత్నిస్తోందని, భారత కుటుంబ విలువల గురించి కాంగ్రెస్‌కి ఏమాత్రం అవగాహన లేదని ఆయన విమర్శించారు.