PM Modi: టారిఫ్ ఉద్రిక్తతల వేళ అమెరికాకు మోడీ.. ఎప్పుడంటే..!
- టారిఫ్ ఉద్రిక్తతల వేళ అమెరికాకు మోడీ
- ఐరాస సమావేశాల్లో పాల్గొననున్న ప్రధాని
- ట్రంప్‌తో సమావేశం అయ్యే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ మరోసారి అమెరికా పర్యటనకు సిద్ధపడుతున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఫిబ్రవరిలో మోడీ వైట్‌హౌస్ సందర్శించారు. ట్రంప్‌తో మంచి సంబంధాలు కనిపించాయి. అయితే ఈ మధ్య సుంకాలు కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో మోడీ అమెరికా పర్యటన చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: Rajasthan: ఘోరం.. వ్యాన్-కంటైనర్ ఢీ.. ఏడుగురు పిల్లలు సహా 10 మంది మృతి
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జరగనుంది. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలకు ప్రపంచ నాయకులంతా హాజరుకానున్నారు. న్యూయార్క్ వేదికగా జరిగే ఈ సమావేశానికి ప్రధాని మోడీ కూడా హాజరుకానున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సహా పలువురు నాయకులను మోడీ కలవనున్నారు. పర్యటనలో భాగంగా ట్రంప్‌తో కూడా మోడీ సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సుంకాల వివాదం పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: TG School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేడు, రేపు పాఠశాలలకు సెలవు
వాణిజ్య సమస్యలు కారణంగా అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న కారణంగా ట్రంప్‌తో మోడీ సమావేశమై సమస్యలను పరిష్కరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ట్రంప్ మొదటి పరిపాలన కాలంలో మోడీతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. మోడీ స్నేహితుడిగా ట్రంప్ అభివర్ణించారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చాక.. భారత్‌పై భారీగా సుంకాలు విధించడంతో బంధాలు బీటలువారాయి.
భారత్‌పై తొలుత 25 శాతం సుంకం విధించగా అది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించినట్లుగా ట్రంప్ బాంబ్ పేల్చారు. ఇలా భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక మోడీ పర్యటనతోనైనా సంబంధాలు మెరుగుపడతాయేమో చూడాలి.
తాజావార్తలు
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!