Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Can Vijay Deverakonda Comeback With Ranabaali: టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో ‘విజయ్ దేవరకొండ’కు గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు. 2018లో వచ్చిన ‘గీత గోవిందం’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న విజయ్.. ఆ తర్వాత వరుసగా ఫ్లాప్‌లను ఎదుర్కొన్నాడు. గీత గోవిందం తర్వాత విజయ్ టాలీవుడ్లో టాప్‌లోకి దూసుకెళ్తాడని చాలామంది భావించారు. అయితే ఆ స్థాయిలో విజయాల పరంపరను కొనసాగించడంలో విఫలమై.. రేసులో వెనకపడిపోయాడు. ‘డియర్ కామ్రేడ్’ పర్వాలేదనిపించినా.. ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ‘లైగర్’ సైతం విజయ్ కెరీర్‌కు ఊహించని షాక్ ఇచ్చింది.
‘ఖుషి’, ‘ఫ్యామిలీ స్టార్’, ‘కింగ్డమ్’ చిత్రాలు కూడా విజయ్ దేవరకొండకు ఆశించిన కమ్‌బ్యాక్‌ను ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ తన తదుపరి చిత్రం ‘రణబాలి’పైనే ఉన్నాయి. ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదలకు సమయం దగ్గరపడుతున్నప్పటికీ.. సినిమాపై ఆశించిన స్థాయిలో బజ్ కనిపించడం లేదు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను, ఆసక్తిని క్రియేట్ చేయలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. విజయ్‌కు ఉన్న స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా సినిమాపై హైప్ రావాల్సి ఉన్నప్పటికీ.. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.
Also Read
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
రణబాలి విడుదలకు ముందు చిత్రబృందం చేతిలో ఉన్న చివరి ప్రధాన ఆయుధం ట్రైలర్. ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపని ప్రమోషనల్ కంటెంట్‌కు భిన్నంగా ట్రైలర్ అదిరిపోయేలా ఉంటే.. సినిమాపై ఒక్కసారిగా బజ్ పెరిగే అవకాశం ఉంది. ట్రైలర్ బాగుంటే రణబాలిపై అంచనాలు పెరుగుతాయి. రష్మిక కూడా సినిమాకు అదనపు బలం కానునున్నారు. ఇక అంతా ట్రైలర్ పైనే ఆధారపడి ఉంది. విజయ్ కెరీర్లో గీత గోవిందం తర్వాత సరైన బ్లాక్‌బస్టర్ కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. వరుస పరాజయాల తర్వాత రణబాలితో విజయ్ మళ్లీ తన సత్తా చాటుతాడా?.. ఆయన కెరీర్ మళ్లీ ఉపందుకుంటుందా? అనేది రణబాలి ఫలితమే నిర్ణయిస్తుంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!