iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone Sale: ఐఫోన్ కొనాలనుకునేవారికి పండగ ముందే వచ్చేసిందనే చెప్పాలి. పండుగ సీజన్ సేల్స్ సందర్భంగా కొత్త ఐఫోన్ కొనాలని చాలామంది ప్లాన్ చేసుకుంటుంటారు. దీనికి తగ్గట్లే కంపెనీలు కూడా భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే పోస్టర్లపై కనిపించే ప్రతి ఆఫర్ మనకు వర్తించదు, కొన్నిసార్లు అది నిజమైన డిస్కౌంట్ కాకపోవచ్చు. అందుకే అసలు ఐఫోన్లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో స్పష్టంగా తెలుసుకోవడం ముఖ్యం. మీరు ఈ ఫెస్టివ్ సీజన్లో కొత్త ఐఫోన్ కొనాలని చూస్తుంటే, రిలయన్స్ డిజిటల్ (Reliance Digital) మీకో మంచి వార్త మోసుకొచ్చింది. Apple కొత్త మోడల్స్ తీసుకొచ్చిన తర్వాత పాత ఐఫోన్లపై ఆఫర్లు జోరందుకున్నాయి. ఈ క్రమంలో రిలయన్స్ డిజిటల్ తన ‘Festival of Electronics’ సేల్‌లో iPhone 15, iPhone 16, iPhone 17 మోడళ్లపై భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ప్రకటించింది. విశేషమేమిటంటే, బ్యాంక్ క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్ అన్ని కలుపుకుంటే iPhone 17 ఎఫెక్టివ్ ధర ఏకంగా రూ. 68,899కి దిగివస్తోంది.
ఈ సేల్‌లో iPhone 17 (256GB) అసలు ధరను రూ. 79,899గా లిస్ట్ చేశారు. దీనిపై రూ. 3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్, రూ. 8,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందే అవకాశం ఉంది. ఈ రెండింటినీ కలిపితే ఫోన్ ఎఫెక్టివ్ ప్రైస్ రూ. 68,899 అవుతుంది. అక్టోబర్ 9న ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సేల్‌లో ఆఫర్ అందుబాటులోకి వస్తుంది. అంటే దాదాపు రూ. 1 లక్ష వరకు ఉండే కొత్త iPhone 17, ఆఫర్లతో రూ. 70 వేల ఆవరణలోకి వచ్చేస్తుండటం పండుగ వేళ నిజంగా క్రేజీ డీల్ అనే చెప్పాలి. అయితే, ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ అనేది మీరు ఇచ్చే పాత ఫోన్ మోడల్, దాని వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది కాబట్టి, రూ. 68,899 అనేది గరిష్ట ప్రయోజనంతో వచ్చే ధర అని గుర్తుంచుకోవాలి.
Also Read
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
ఇది మాత్రమే కాదు, పాత మోడల్స్ అయిన iPhone 15, iPhone 16లపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. iPhone 15 (128GB) ఎఫెక్టివ్ ధర రూ. 55,399 కాగా, iPhone 16 (128GB) ఎఫెక్టివ్ ధర రూ. 65,399కి వస్తోంది. ఇక్కడే అసలైన లెక్క మొదలవుతుంది. iPhone 15 నుంచి iPhone 16కి వెళ్లాలంటే రూ. 10,000 అదనంగా ఖర్చవుతుంది. కానీ, iPhone 16 నుంచి iPhone 17కి వెళ్లాలంటే కేవలం రూ. 3,500 మాత్రమే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ మీరు కొంత బడ్జెట్ పెంచగలగితే, ఆ కొద్దిపాటి తేడాతో నేరుగా లేటెస్ట్ iPhone 17 సొంతం చేసుకోవడమే తెలివైన పని. ఇక ప్రో మోడల్స్ విషయానికి వస్తే, iPhone 17 Pro, Pro Maxలపై కూడా రిలయన్స్ డిజిటల్ భారీ ఆఫర్లను చూపించింది. iPhone 17 Pro (256GB) అసలు ధర రూ. 1,34,900 కాగా, రూ. 9,910 ఇన్-స్టోర్ డిస్కౌంట్ తర్వాత రూ. 1,24,990కి చేరుతుంది. అయితే క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్లు కలిపి దీని ఎఫెక్టివ్ ధరను రూ. 56,990గా, iPhone 17 Pro Max (256GB) ఎఫెక్టివ్ ధరను రూ. 71,990గా బోర్డులపై ప్రకటిస్తున్నారు. కానీ ఈ ప్రకటనలు చూసి వెంటనే సంబరపడకూడదు. ఎందుకంటే, పాత iPhone 15 Proకి రూ. 55,000 ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 క్యాష్‌బ్యాక్ వస్తాయని లెక్కకట్టి కంపెనీ ఆ ధరకు చూపుతోంది. మీ పాత ఫోన్‌కు అంత వ్యాల్యూ రాకపోతే మీరు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రకటనల్లో చెబుతున్న రూ. 77,910 ఆదా అనేది నేరుగా బిల్లో తగ్గే డిస్కౌంట్ కాదు. అందులో ఇన్-స్టోర్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ విలువ, బోనస్, క్యాష్‌బ్యాక్ అన్నీ కలిసి ఉంటాయి. దీంతో పాటు బ్యాంక్ ఆఫర్లలోనూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. అక్టోబర్ 7 నుంచి 13 వరకు HDFC క్రెడిట్ కార్డ్‌పై రూ. 3,000 నుంచి రూ. 6,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్లభిస్తుంది. అయితే ఇది కొన్ని షరతులకు లోబడి ఉంటుంది. ప్రతి ఆఫర్‌తో దీన్ని క్లబ్ చేయలేము. కాబట్టి ప్రకటనల్లోని చివరి ధరను మాత్రమే చూడకుండా, మీ వద్ద ఉన్న కార్డ్, మీ పాత ఫోన్ పరిస్థితి ఆధారంగా మీకు ఎంత నికర ప్రయోజనం వస్తుందో చెక్ చేసుకోవడం బెటర్.
తాజావార్తలు
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!