PM Modi: మరో రెండు విదేశీ పర్యటనలకు మోడీ.. షెడ్యూల్ ఇదే!
- మరో రెండు విదేశీ పర్యటనలకు మోడీ
- షెడ్యూల్ ప్రకటించిన విదేశాంగ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ మరో రెండు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. జూలై 23-26 తేదీల్లో యూకే, మాల్దీవుల్లో మోడీ పర్యటించనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ తెలిపింది. ఇటీవలే ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనకు వెళ్లొచ్చారు. కొద్ది రోజుల గ్యాప్‌లనే మరో రెండు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు.
23, 24 తేదీల్లో మోడీ యునైటెడ్ కింగ్డమ్లో పర్యటించనున్నారు. అక్కడ భారతదేశం-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సంతకం చేయనున్నారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతులపై ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా భారతదేశానికి విస్కీ, కార్ల వంటి బ్రిటిష్ ఎగుమతులపై సుంకాలు తగ్గనున్నాయి.
Also Read
ఇది కూడా చదవండి: Amit Shah: 2036 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించండి.. అథ్లెట్లకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించిన అమిత్ షా
ఇక జూలై 25-26 తేదీల్లో ప్రధాన మోడీ మాల్దీవుల్లో పర్యటించనున్నారు. గతేడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రులు నోరుపారేసుకున్నారు. దీంతో భారతీయ టూరిస్టులు.. మాల్దీవులు వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో నష్టాన్ని గుర్తించిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు దిగొచ్చారు. గతేడాది ఢిల్లీలో జరిగిన మోడీ ప్రమాణస్వీకారానికి మాల్దీవుల అధ్యక్షుడు హాజరయ్యాడు. మొత్తానికి రాజకీయ ఉద్రిక్తతల తర్వాత మోడీ మాల్దీవుల్లో పర్యటించడం ఇదే తొలిసారి. అంతేకాకుండా మొహమ్మద్ ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడు అయ్యాక మోడీ పర్యటించడం కూడా ఇదే ప్రథమం.
ఇది కూడా చదవండి: Trump: భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట
ఇక మాల్దీవుల 60వ జాతీయ దినోత్సవ వేడుకలకు మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 2019లో మోడీ మాల్దీవులకు వెళ్లారు. రాజకీయ ఉద్రిక్తతల తర్వాత తిరిగి ఇన్నాళ్లకు మాల్దీవులకు మోడీ వెళ్తున్నారు. ఈ పర్యటనలతో తిరిగి దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడనున్నాయి. అంతేకాకుండా మాల్దీవుల టూరిజం కూడా పుంజుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
IND vs AFG ODI: టీమిండియాకు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ ఆటగాళ్లు దూరం..
-
Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్‌పై ట్రంప్ సంచలన ఆరోపణలు
-
US-Iran: జెనీవా వేదికగా ఇరాన్-యూఎస్ శాంతి ఒప్పందం! ఎప్పుడంటే..!
-
Ragi Semiya Puttu: రాగులతో ఇలాంటి స్నాక్ ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ అద్భుతం, ఆరోగ్యం గ్యారెంటీ!
-
Social Media: ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!