మళ్లీ కరోనా టెన్షన్ పెడుతోంది.. థర్డ్ వేవ్ తర్వాత వందల్లోకి పడిపోయిన రోజువారి పాజిటివ్ కేసులు.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి.. వెయ్యిని దాటేసి.. రెండు వేలను కూడా క్రాస్ చేసి.. మూడు వేల వైపు పరుగులు పెడుతున్నాయి.. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ తీవ్రత ఆందోళనకు గురిచేస్తుంది. ఇవాళ 1,204 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృతిచెందారు.. ఇక, దేశవ్యాప్తంగా సోమవారం 2,541 మందికి పాజిటివ్‌గా తేలింది.. 30 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.
Read Also: TRS Plenary: గులాబీ మయం.. పడవలోనూ ప్రచారం..
మళ్లీ కోవిడ్ బోర్డు పైకి కదులుతుండడంతో.. అప్రమత్తమైన కేంద్రం.. మహమ్మారి కట్టడికి చర్యలు చేపట్టాలని ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ .. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు.. మళ్లీ కలవరపెడుతోన్న కరోనా కేసులు, ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం కోవిడ్ కేసుల తీవ్రత, కోవిడ్ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.