కాసేపట్లో హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారంతో పాటు పలు ఇతర అంశాలపైనా ఇద్దరు సీఎంలు దృష్టి సారిస్తారు. ఇద్దరూ సీఎంలు అయ్యాక తొలిసారి భేటీ కానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. రెండు రాష్ట్రాల సీఎంల భేటీపై పలువురు నేతలు ఆసక్తికర ట్వీట్లు చేశారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులకు ఇవాళ( సోమవారం) ఫోన్ లో మాట్లాడారు. ఉత్తర భారత దేశంలో గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వరదల దెబ్బకు రహదారులు తెగిపోయాయి. ఆయా ప్రాంతాలు, గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు పెద్ద పెద్ద భవనాలు కూడ పేకమేడలా కూలిపోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో…
మళ్లీ కరోనా టెన్షన్ పెడుతోంది.. థర్డ్ వేవ్ తర్వాత వందల్లోకి పడిపోయిన రోజువారి పాజిటివ్ కేసులు.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి.. వెయ్యిని దాటేసి.. రెండు వేలను కూడా క్రాస్ చేసి.. మూడు వేల వైపు పరుగులు పెడుతున్నాయి.. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ తీవ్రత ఆందోళనకు గురిచేస్తుంది. ఇవాళ 1,204 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృతిచెందారు.. ఇక, దేశవ్యాప్తంగా సోమవారం 2,541 మందికి పాజిటివ్‌గా తేలింది.. 30 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.…
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది మాయదారి కరోనావైరస్.. ఎప్పటికప్పుడు రూపాంతరాలు చెందుతూ ప్రజలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది.. డెల్టా వేరియంట్ రూపంలో భారత్‌లో సెకండ్ వేవ్ విధ్వంసమే సృష్టించగా.. ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో పంజా విసురుతోంది.. ఇప్పటికే దేశంలో కరోనా థర్డ్ వే ప్రారంభమై పోయింది.. 15 రాష్ట్రాల్లో థర్డ్‌వేవ్ స్టార్ట్ అయినట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు.. ఓవైపు డెల్టా వేరియంట్, మరోవైపు ఒమిక్రాన్ ఇప్పుడు క్రమంగా కేసులు పెరగడానికి కారణం అవుతున్నాయి… మూడు, నాలుగు రోజుల క్రితం 20…