Niti Aayog: ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Niti Aayog: నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరగనుంది. సంస్థ ఛైర్మన్, ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షత వహిస్తారు. ఈ భేటీలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారు. 2019 జులై తర్వాత పాలకమండలి సభ్యులు భౌతికంగా హాజరుకానుండడం ఇదే తొలిసారి. పప్పులు, నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడం, పంటల మార్పిడి, జాతీయ నూతన విద్యావిధానం అమలు, పట్టణ పరిపాలన తదితర అంశాలు ఎజెండాలో ఉన్నాయి.
స్థిరమైన, సమ్మిళిత భారతాన్ని నిర్మించే దిశలో ప్రభుత్వ థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ ఏడవ పాలక మండలి సమావేశం కొనసాగుతుందని.. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సహకారం వైపు సమన్వయాలకు ఈ భేటీ మార్గం సుగమం చేస్తుందని పలువురు భావిస్తున్నారు. భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని స్మరించుకుంటున్నందున, రాష్ట్రాలు సహకార సమాఖ్య స్ఫూర్తితో ‘ఆత్మనిర్భర్ భారత్’ వైపు పయనించడం ఆవశ్యకమని ఒక అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ సమావేశానికి సన్నాహాల్లో భాగంగా జూన్ 2022లో ధర్మశాలలో జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సదస్సుకు ప్రధాని అధ్యక్షత వహించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు ఇందులో పాల్గొన్నారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Piyush Goyal: కేసీఆర్ తెలంగాణకు “నిజాం”గా మారాడు.. రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు ఆసక్తి లేదు
నీతిఆయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. శనివారం రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమావేశాన్ని బహిష్కరించారు. జాతీయ ప్రణాళిక మండలికి ప్రత్యామ్నాయంగా ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన నీతిఆయోగ్‌లో నీతి లేదని, అది నేతిబీర చందంగా మారిందని, దాని వల్ల ఎవరికీ మేలు జరగడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. నీతిఆయోగ్‌ను నిరర్థకంగా మార్చిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. ఆదివారం ప్రధాని మోదీ అధ్యక్షతన దిల్లీలో జరిగే సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!