Site icon NTV Telugu

PM Modi: సౌదీ యువరాజుకు మోడీ ఫోన్.. పశ్చిమాసియా సంక్షోభంపై చర్చ

Pmmodi

Pmmodi

సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి అయిన హెచ్‌ఆర్‌హెచ్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణపై ఇరువురి మధ్య సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా సౌదీ అరేబియాలోని భారతీయు సంక్షేమానికి అందిస్తున్న మద్దతుకు మోడీ ధన్యవాదాలు తెలియజేశారు.

ఇంధన సంస్థలపై దాడులను సహించబోమని, సముద్రంలో భద్రతను తప్పనిసరిగా పాటించాలని సౌదీ యువరాజుతో మోడీ అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో మోడీ పేర్కొన్నారు. ప్రాంతీయ ఇంధన సంస్థలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత ఉద్రిక్తతల నడుమ సముద్ర వాణిజ్య మార్గాలను తెరిచి, సురక్షితంగా ఉంచడం అత్యంత కీలకమని ఇరువురు నాయకులు నొక్కి చెప్పారు.

మంగళవారం ప్రధాని మోడీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మధ్య కూడా ఫోన్ సంభాషణ జరిగింది. హార్ముజ్ జలసంధి‌పై ఇరువురి మధ్య చర్చకు వచ్చింది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలయ్యాక ట్రంప్-మోడీ మధ్య జరిగిన సంభాషణ ఇదే మొదటిది.

 

Exit mobile version