నేడు దేశంలోని పలు జిల్లాల అధికారులతో ప్రధాని సమావేశం కానున్నారు. “కోవిడ్-19” పరిస్థితి, వ్యాక్సినేషన్‌పై వారితో చేర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా అధికారులతో భేటీ కానున్నాడు మోడీ. ఇందులో తొలి విడతగా కర్నాటక, బిహార్, అస్సాం, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలలోని జిల్లాల అధికారులతో సమావేశం కానున్న ప్రధాని మోడీ… వచ్చే గురువారం మిగతా రాష్ట్రాలకు చెందిన అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు.