PM Surya Ghar Yojana: ‘‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ’’పేరుతో ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రకటించారు. కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం కోసం రూఫ్‌టాఫ్ సోలార్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. రూ. 75,000 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. సబ్సీడీలు, భారీ రాయితీలను నేరుగా ప్రజల ఖాతాలకు చేరేలా కేంద్రం భరోసా ఇస్తోంది.
PM Surya Ghar Yojana: ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. సౌరశక్తి, స్థిరమైన పురోగతిని ప్రోత్సహించడానికి, కేంద్ర ప్రభుత్వం త్వరలో 'పీఎం సూర్య ఘర్ యోజన: ఉచిత విద్యుత్ పథకం'ని ప్రారంభించబోతోంది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడం ద్వారా కోటి ఇళ్లలో వెలుగులు నింపడం ఈ పథకం లక్ష్యం. ఈ ప్రాజెక్టులో రూ.75,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుందని ప్రధాని చెప్పారు.