PM Modi: వీధికుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ‘‘జంతు ప్రేమికుల’’ నుంచి పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. ఈ చర్చ జరుగుతున్న సమయంలో, ప్రధాని నరేంద్ర మోడీ ‘‘యానివల్ లవర్స్’’పై సెటైర్లు వేశారు. కేవలం ఒకే లైన్తో వారి కపటత్వాన్ని ఎత్తిచూపారు. శుక్రవారం విజ్ఞాన్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. జంతుప్రేమికులతో ఇటీవల తన సమావేశం గురించి వ్యాఖ్యానించారు.
Read Also: Dalapathi Vijay: ‘ఐ యామ్ కమింగ్’ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన దళపతి విజయ్
ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. ‘‘ఇటీవల కాలం తాను కొంతమంది జంతు ప్రేమికులను కలిశాను’’ అని మోడీ అనడంతో, ఒక్కసారిగా ప్రేక్షకుల నుంచి నవ్వులు వచ్చాయి. దీనికి ప్రతిగా ‘‘ఎందుకు నవ్వుతున్నారు.? మన దేశంలో చాలా మంది జంతు ప్రేమికులు ఉన్నారు. కానీ ఎక్కువ మంది గోవును జంతువుగా పరిగణించరు’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలు ఇటీవల వీధి కుక్కల తరలింపు అంశంతో లింక్ చేయబడ్డాయి.
వీధి కుక్కల్ని షెల్టర్ జోన్లకు తరలించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే, దీనికి వ్యతిరేకంగా జంతు ప్రేమికులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. కుక్కల బారిన పడి పలువురు రేబిస్ వ్యాధితో మరణిస్తుండటంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై యానిమల్ యాక్టివిస్టులు, సెలబ్రిటీల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఆందోళనకు తలొగ్గిని సుప్రీంకోర్టు టీకాలు వేసిన తర్వాత వాటిని తిరిగి అదే ప్రాతంలో విడిచిపెట్టాలని ఆదేశించింది.