Dalapathi Vijay: తమిళనాడులో 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సమరానికి శనివారం సినీ నటుడు, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ శంఖం పూరించారు. ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఎన్నికల ఫలితాలపై జోరుగా చర్చజరుగుతుంది. శనివారం విజయ్ తిరుచ్చిలో ‘ఐ యామ్ కమింగ్’ పేరుతో భారీ ఎలక్షన్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. విజయ్ ఇప్పటికే ‘మీట్ ది పీపుల్స్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ వరకు ప్రతి శని, ఆదివారాల్లో జనంలోకి రానున్నట్లు ప్రకటించారు.
READ ALSO: Ramakrishna: చంద్రబాబు హయాంలో అన్నీ ప్రైవేట్‌పరం.. !
ఆయన దూకుడు చూస్తుంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తుకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నిర్వహించిన వారాహి యాత్రను గుర్తు తెచ్చేలా దళపతి ‘మీట్ ది పీపుల్స్’ కార్యక్రమం ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే విజయ్ ప్రచారం కోసం ప్రత్యేకంగా హైటెక్ బస్సును సిద్ధం చేశారు. బస్సుపైకి ఎవరూ ఎక్కకుండా ఉండేందుకు పైభాగంలో ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇది పూర్తిగా వారాహి వాహనం స్టైల్లోనే కనిపిస్తోంది. తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సింగిల్‌గా పోటీ చేస్తాను అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. దళపతి రాజకీయాల్లో తనదైన వ్యూహాన్ని అమలు చేస్తూ ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే ఆయన తన పార్టీ సభ్యత్వం కోసం ‘మై టీవీకే’ అనే యాప్‌ను ప్రారంభించారు. రెండు కోట్ల మంది సభ్యులను చేర్చుకోవాలనే టార్గెట్‌తో ముందుకు సాగుతున్నట్లు ఇప్పటికే పార్టీ ప్రకటించింది.
విజయ్ జోరు చూస్తుంటే తమిళ రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టించేలా ఉన్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ద్రావిడ రాజకీయాల్లో ఇప్పటి వరకు అన్నాడీఎంకే, డీఎంకేల మధ్య ఉన్న నెక్ వైట్ ఇప్పుడు విజయ్ రాకతో కాక రేపుతుంది. ఈ త్రిముఖ పోరులో నాయకత్వ లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
READ ALSO: PM Modi Manipur Visit: ప్రధాని సమక్షంలో కంటతడి పెట్టిన బాధితులు..