ప్రధాని మోడీ శనివారం మిజోరాంలో చారిత్రక రైల్వే లైన్‌ను ప్రారంభించారు. మిజోరాంలోని బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్‌ను ప్రధాని ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. మిజోరాం రాలేనందుకు క్షమించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భగా మోడీ మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్ కేవలవం రైల్వే కనెక్షన్ కంటే ఎక్కువ అని.. ఇది మిజోరాంకు పరివర్తనకు జీవనాడిగా అభివర్ణించారు. ఇది జీవితాలను, జీవనోపాధిని విప్లవాత్మకంగా మారుస్తుందని చెప్పారు.

రైతులు, వ్యాపారాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని.. అలాగే పర్యాటకం, రవాణా రంగాల్లో.. ఉపాధి అవకాశాలు సృష్టించడానికి వీలు కల్పిస్తుందని వివరించారు. భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా చెప్పారు. 2025-26 మొదటి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి చెందిందని.. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, ఎగుమతుల పురోగతే కారణం అని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో మేడ్-ఇన్-ఇండియా ఆయుధాలే కీలక పాత్ర పోషించాయని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Charlie Kirk: చార్లీ కిర్క్ హంతకుడు ఎలా దొరికాడు.. ఎఫ్‌బీఐ సాధించిందేమీ లేదా?
ఇక జీఎస్టీ సంస్కరణలను కూడా ప్రధాని ప్రశంసించారు. అనేక ఉత్పత్తులపై పన్నుల భారం తగ్గిందని.. దీంతో పేద కుటుంబాలపై భారం తగ్గిందని గుర్తుచేశారు. టూత్‌పేస్ట్, సబ్బు, నూనె, నిత్యావసర వస్తువులపై ఇప్పుడు 5 శాతమే జీఎస్టీ ఉందని చెప్పారు. తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన మందుల ధరలు కూడా తగ్గాయని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Hamas-Israel: ఖతార్‌లో పని చేయని ఇజ్రాయెల్ ఎత్తుగడ.. సజీవంగా హమాస్ నేతలు.. అసలేమైందంటే..!
మిజోరం రాజధాని ఐజ్వాల్‌కు రైల్వే లైన్ వేసే ప్రాజెక్టుకు ప్రధాని మోడీ 2014లో శంకుస్థాపన చేశారు. అప్పటిదాకా మిజోరంలోని బైరాబి వరకు మాత్రమే రైల్వే లైను ఉండేది. అసోం సరిహద్దుకు సమీపంలోని ఈ స్టేషన్ వరకు లైన్ ఉన్నప్పటికీ మిజోరం ప్రజలకు పెద్దగా ఉపయోగం లేదనే చెప్పాలి. అందుకే రాజధాని ఐజ్వాల్‌ను కలిపే లక్ష్యంతో ఈ బైరాబి నుంచి ఐజ్వాల్ పక్కనుండే సాయ్‌రంగ్‌కు లైన్ ప్రాజెక్ట్ చేపట్టారు. రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సరికి రూ.8 వేల కోట్లకు పైగా ఖర్చయ్యింది. ఈ ప్రాజెక్ట్ రాజధానికి రైల్ కనెక్టివిటీ ఏర్పడటంతో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కనుంది. ముఖ్యంగా సరుకు రవాణా పెరగడంతో నిత్యావసరాల ధరలు తగ్గి ప్రజలకు పెద్ద ఊరట లభిస్తుంది.
A landmark day for Mizoram as it joins India's railway map! Key infrastructure projects are also being initiated. Speaking at a programme in Aizawl. https://t.co/MxM6c2WZHZ
— Narendra Modi (@narendramodi) September 13, 2025