PM Modi: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ అగ్రయ్, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ దునగిరి
- భారత నౌకాదళానికి కొత్త బలం
- INS అగ్రయ్, దునగిరి, సంశోధక్ ప్రవేశం
- మూడు కీలక నౌకలను నౌకాదళానికి అంకితం చేసిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత నౌకాదళ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు కీలక స్వదేశీ నౌకాదళ ప్లాట్‌ఫారమ్‌లను నౌకాదళంలోకి అధికారికంగా ప్రవేశపెట్టారు. కోల్‌కతాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్ఎస్ అగ్రయ్, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ దునగిరి నౌకలను భారత నౌకాదళానికి అంకితం చేశారు. ఈ మూడు నౌకలు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి, నిర్మించినవిగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. వీటి చేరికతో భారత నౌకాదళం కార్యాచరణ, పర్యవేక్షణ, రక్షణ సామర్థ్యాలు మరింత బలపడనున్నాయి.
ఆధునికత, ఆత్మనిర్భరతకు ప్రతీక
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఈ మూడు నౌకలు భారతదేశ ఆధునికత, ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలని పేర్కొన్నారు. రక్షణ రంగంలో దేశం స్వావలంబన దిశగా వేగంగా అడుగులు వేస్తోందని అన్నారు.
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
ఐఎన్ఎస్ సంశోధక్ ప్రత్యేకతలు
ఐఎన్ఎస్ సంశోధక్ ఒక అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌక. సముద్రగర్భ మ్యాపింగ్, హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించడం, సురక్షిత నౌకాయాన మార్గాలను గుర్తించడం, సముద్ర శాస్త్ర సమాచారాన్ని సేకరించడం దీని ప్రధాన బాధ్యతలు. అదనంగా, మానవతా సహాయం, విపత్తు నిర్వహణ సమయంలో ఈ నౌక తేలియాడే వైద్య కేంద్రంగా కూడా సేవలందించగలదు.
ఐఎన్ఎస్ అగ్రయ్ ప్రత్యేకతలు
ఐఎన్ఎస్ అగ్రయ్ ఒక అధునాతన యాంటీ-సబ్‌మరైన్ వార్ఫేర్ (ASW) షాలో వాటర్ క్రాఫ్ట్. తీర ప్రాంతాలు, నిస్సార జలాల్లో శత్రు జలాంతర్గాములను గుర్తించడం, ట్రాక్ చేయడం, అవసరమైతే వాటిని ధ్వంసం చేయడం దీని ప్రధాన విధి.
ఈ నౌకలో ఆధునిక సోనార్ వ్యవస్థలు, యాంటీ సబ్‌మరైన్ రాకెట్లు, టార్పెడోలు, 30 మి.మీ నావికా గన్ మైన్లు అమర్చే సామర్థ్యం వంటి అధునాతన రక్షణ వ్యవస్థలు ఉన్నాయి.
ఐఎన్ఎస్ దునగిరి ప్రత్యేకతలు
ఐఎన్ఎస్ దునగిరి, ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన నీలగిరి తరగతి స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. ఇది భారత నౌకాదళంలో అత్యాధునిక యుద్ధనౌకలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
ఈ నౌకలో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, బరాక్-8 వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ, టార్పెడోలు, ఆధునిక రాడార్, యుద్ధ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. వాయు రక్షణ, ఉపరితల యుద్ధం, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ కార్యకలాపాలను ఒకేసారి నిర్వహించే సామర్థ్యం దీనికి ఉంది.
ఆత్మనిర్భర్ భారత్‌కు నిదర్శనం
కోల్‌కతాకు చెందిన Garden Reach Shipbuilders & Engineers (GRSE) నిర్మించిన ఈ మూడు నౌకలు ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. రక్షణ రంగ తయారీలో భారతదేశం సాధిస్తున్న స్వావలంబనకు ఇవి ప్రతీకలుగా నిలుస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూడు నౌకల చేరికతో భారత నౌకాదళం కార్యాచరణ సామర్థ్యాలు, సముద్ర భద్రతా వ్యవస్థలు మరింత బలోపేతం కానున్నాయి.
తాజావార్తలు
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Telangana Ration: రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా..? వారికి భారీ హెచ్చరిక..
-
Vivo T5 5G: భారత్ లో త్వరలో విడుదల కానున్న వివో టి5 5జి.. 3డి కర్వ్డ్ డిస్ప్లే, ఏఐ ఫీచర్స్
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
Brahmastra 2: ‘రామాయణం’ తర్వాత రణబీర్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?.. ద్విపాత్రాభినయంతో సిద్ధమవుతున్నాడా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!