PM Modi: పేదోడికి ఇల్లు ఉండాలన్నదే తన కల.. ఢిల్లీ ఎన్నికల్లో మోడీ వ్యాఖ్య
- పేదోడికి ఇల్లు ఉండాలన్నదే తన కల
- ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలన్నదే తన కల అని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్వారకా ప్రాంతంలో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తనకు సొంతిల్లు లేదని.. పేదోడికి మాత్రం ఇల్లు ఉండాలన్నది తన కల అని చెప్పారు. ఢిల్లీలో పేదల కోసం కేంద్రం నిర్మించిన ఇళ్లను ఆప్ కేటాయించడం లేదని… కోట్ల రూపాయలతో శీష్‌మహల్‌ను నిర్మించుకున్నవారికి పేదల బాధ అర్థంకాదని ధ్వజమెత్తారు. పేదల సొంతింటి కల నెరవేరాలంటే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి దేశ రాజధాని ఆప్‌కు ఏటీఎంలా మారిందని విమర్శించారు.
ఇది కూడా చదవండి: Economic Survey 2024-25: భారీ లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు.. ఉద్యోగుల నోట్లో మట్టి!
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
ఢిల్లీలో ఉన్న మహిళలంతా బ్యాంక్ ఖాతాతో ఫోన్ నెంబర్ లింక్ చేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ఖాతాలో డబ్బు జమ అయిన సందేశాన్ని అందుకుంటారన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి మంత్రివర్గ సమావేశంలో మహిళల బ్యాంక్ ఖాతాల్లో రూ.2,500 పథకంపై నిర్ణయం ఉంటుందని మోడీ స్పష్టం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుంది. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ప్రధానంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
#DelhiElection2025 | Prime Minister Narendra Modi addresses a public meeting in Delhi's Dwarka area, says, "I would ask all the women in Delhi to link their phone number with their bank account so that they could receive the message that money has been credited to their account… pic.twitter.com/qtCUHmAOmK
— ANI (@ANI) January 31, 2025
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!