Idupu Kayitham Teaser: ‘ఇడుపు కాయితం’ అంటే.. విడాకులా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Idupu Kayitham Teaser Out: టాలీవుడ్లో విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘ప్రియదర్శి’ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. టైటిల్ అనౌన్స్మెంట్తోనే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ప్రేమ, పెళ్లి, కుటుంబ అనుబంధాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వంటి అంశాలను వినోదాత్మకంగా చూపిస్తూ టీజర్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పెళ్లితో మొదలైన కథ చివరకు విడాకుల పత్రం దగ్గరకు చేరడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
‘రామాయణం ఎక్కడ ఆగిపోతుంది అనుకుంటామో.. అక్కడ ఒక స్త్రీ ప్రవేశిస్తుంది.. అక్కడి నుంచి రామాయణం ముందుకు వెళుతుంది’ అంటూ ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పిన మాటలతో టీజర్ ప్రారంభమవుతుంది. ఈ డైలాగ్ ద్వారా కథలో శ్రీలత పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ప్రేమ, కామెడీ, పెళ్లి, కుటుంబ భావోద్వేగాలతో కథను ఆసక్తికరంగా పరిచయం చేశారు. గ్రామీణ వాతావరణం, సహజమైన సంభాషణలు టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Also Read
- Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం.. అసలు ఏం జరిగిందంటే..?
- Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
- Gold and Silver Prices Fall: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Sekhar Master: శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు గాయాలు..
ఈ చిత్రంలో ప్రియదర్శి శ్రీను పాత్రలో, నాగదుర్గ శ్రీలత పాత్రలో నటిస్తున్నారు. వీరిద్దరి పరిచయం, ప్రేమ, పెళ్లి చూపులు, వివాహం వంటి సన్నివేశాలను టీజర్లో సరదాగా చూపించారు. పెళ్లి తర్వాత కొత్త జంట జీవితంలో చోటుచేసుకునే చిన్న చిన్న సంఘటనలు, అలకలు, కుటుంబ సభ్యులతో అనుబంధాలు, భార్యాభర్తల మధ్య సరదా సంభాషణలు ప్రేక్షకులను నవ్వించేలా ఉన్నాయి. అయితే కథలో అసలు ట్విస్ట్ మాత్రం చివర్లో కనిపిస్తుంది. పెళ్లితో ఒక్కటైన శ్రీను, శ్రీలత చివరకు విడాకుల పత్రం వరకు ఎందుకు వెళ్లారు? వారి మధ్య ఏం జరిగింది? అనే ప్రశ్నలను టీజర్ లేవనెత్తుతోంది. ‘ఇడుపు కాయితం’ అంటే విడాకుల పత్రం అనే అర్థం కావడంతో టైటిల్‌కు తగ్గట్టుగానే కథలో ఆసక్తికరమైన మలుపు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
‘బలగం’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించిన ప్రియదర్శి.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు తెలంగాణ జానపద పాటలతో గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ఈ చిత్రం ద్వారా కథానాయికగా టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. శ్రీలత పాత్రలో ఆమె నటన ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా దీపావళి సందర్భంగా విడుదలైన ‘బారాత్ బీట్’ పాటలో నాగదుర్గ మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై సుకుమార్, తబితా సుకుమార్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘శ్రీలత’, ‘గడప’, ‘బారాత్ బీట్’ పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘ఇడుపు కాయితం’ సినిమాను డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
తాజావార్తలు
-
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం.. అసలు ఏం జరిగిందంటే..?
-
Idupu Kayitham Teaser: ‘ఇడుపు కాయితం’ అంటే.. విడాకులా..?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Kulgam Terror Attack: కుల్గామ్‌లో CRPFపై ఉగ్రదాడి.. కొత్త ఉగ్ర సంస్థ బాధ్యత వహించినట్లు ప్రకటన, RSSకు బెదిరింపులు
-
Gold and Silver Prices Fall: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ట్రెండింగ్
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!