Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel Beats Jio: భారత టెలికాం రంగంలో జియో, ఎయిర్టెల్ మధ్య పోటీ కొనసాగుతోంది. మొబైల్ నెట్వర్క్ సేవలతో పాటు బ్రాడ్‌బ్యాండ్ విభాగంలోనూ ఈ రెండు సంస్థలు పోటీపడుతున్నాయి. అయితే తాజాగా విడుదలైన ఓ నివేదికలో బ్రాడ్‌బ్యాండ్ అనుభవం విషయంలో జియో కంటే ఎయిర్టెల్ మెరుగైన ఫలితాలు సాధించింది. “ఓపెన్ సిగ్నల్” విడుదల చేసిన నవంబర్ 2026 ఇండియా ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ ఎక్స్పీరియన్స్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
ఈ నివేదిక ప్రకారం.. రిలయబిలిటీ, కన్సిస్టెంట్ క్వాలిటీ, డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్, వీడియో ఎక్స్పీరియన్స్ వంటి ఐదు విభాగాల్లోనూ ఎయిర్టెల్ అవార్డులు సొంతం చేసుకుంది. ముఖ్యంగా నెట్వర్క్ విశ్వసనీయత విషయంలో జియో కంటే 15% మెరుగైన స్కోర్ సాధించింది. ఓపెన్ సిగ్నల్ 100 నుంచి 1,000 పాయింట్ల స్కేల్‌పై నిర్వహించిన అంచనాలో ఎయిర్‌టెల్‌కు 486 పాయింట్లు రాగా, జియో 423 పాయింట్లతో నిలిచింది. డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్స్ విషయంలోనూ ఎయిర్టెల్ ముందంజలో ఉంది. జియో సగటు డౌన్లోడ్ స్పీడ్ 30.5 Mbps, అప్లోడ్ స్పీడ్ 21 Mbpsగా నమోదయ్యాయి. వీటితో పోలిస్తే ఎయిర్టెల్ వేగాలు సుమారు 26 నుంచి 27% ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. కన్సిస్టెంట్ క్వాలిటీ, వీడియో ఎక్స్పీరియన్స్ విభాగాల్లోనూ ఎయిర్టెల్ ఆధిక్యం సాధించింది.
Also Read
- Infinix Xpad 30: 11 ఇంచుల FHD+ డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో Infinix Xpad 30 ట్యాబ్లెట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Qualcomm Layoffs: హైదరాబాద్ సహా భారత్‌లో క్వాల్కామ్ ఉద్యోగులకు బిగ్ షాక్..
- iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
- Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
ఫిక్స్డ్ వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్‌లోనూ
ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA) విభాగంలోనూ ఎయిర్టెల్ ఐదు విభాగాల్లోనూ అవార్డులు గెలుచుకుంది. డౌన్లోడ్ స్పీడ్ విషయంలో ఎయిర్టెల్ 32.4 Mbps సాధించగా, జియో 25.7 Mbpsకే పరిమితమైంది. అప్లోడ్ స్పీడ్‌లో ఎయిర్టెల్ 20.7 Mbps, జియో 17.1 Mbps నమోదు చేశాయి. నెట్వర్క్ నాణ్యత విషయంలోనూ ఎయిర్టెల్ మెరుగైన ఫలితాలు సాధించింది. కన్సిస్టెంట్ క్వాలిటీ విషయంలో ఎయిర్టెల్ 66.2% స్కోర్ సాధించగా, జియో 55%తో నిలిచింది. రిలయబిలిటీ విభాగంలో ఎయిర్‌టెల్‌కు 450 పాయింట్లు, జియోకు 382 పాయింట్లు వచ్చాయి. అంటే ఈ విభాగంలో జియో కంటే ఎయిర్టెల్ 18% మెరుగ్గా ఉంది.
సబ్స్క్రైబర్ల విషయంలో
నెట్వర్క్ అనుభవంలో ఎయిర్టెల్ ముందున్నప్పటికీ, బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్యలో మాత్రం జియో ఆధిపత్యం కొనసాగుతోంది. TRAI గణాంకాల ప్రకారం.. 2026 ఆగస్టు చివరి నాటికి భారత్‌లో 4.86 కోట్ల వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో జియో 1.48 కోట్ల మంది వినియోగదారులతో మొదటి స్థానంలో ఉండగా, ఎయిర్టెల్ 1.14 కోట్ల మంది సబ్స్క్రైబర్లతో రెండో స్థానంలో ఉంది. బీఎస్ఎన్ఎల్ 45.6 లక్షల కనెక్షన్లతో తర్వాతి స్థానంలో నిలిచింది.
- Tags
- Airtel
- Airtel Vs Jio
- Broadband
- BSNL
- Jio
తాజావార్తలు
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
Infinix Xpad 30: 11 ఇంచుల FHD+ డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో Infinix Xpad 30 ట్యాబ్లెట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
CII Partnership Summit: 141 ఒప్పందాలు.. 2.46 లక్షల ఉద్యోగాలు.. విశాఖలో పెట్టుబడుల పండుగ!
-
IPL 2027 Auction: ఐపీఎల్ 2027 వేలానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్? వేలంలో 7 మంది బంగ్లాదేశ్ ఆటగాళ్లు..!
-
RBI Money Transfer Update: RBI కొత్త మనీ ట్రాన్స్ఫర్ రూల్స్.. బ్యాంక్ ఖాతా లేకున్నా NEFT ద్వారా రూ.50,000 పంపొచ్చు!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!