BRICS Summit: బ్రెజిల్ అధ్యక్షతన రియో డి జనీరోలో 17వ బ్రిక్స్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ సమావేశాలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. కాగా, ఈ బ్రిక్స్ సమావేశాల్లో ప్రపంచ శాంతి, గ్లోబల్ గవర్నెన్స్, రిఫార్మ్స్ పై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.
Xi Jinping: చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ గత కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో ఆ దేశంలో ఏదో జరుగుతోందనే ప్రచారం నడుస్తోంది. 13 ఏళ్లుగా చైనాను పాలిస్తూ, మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తివంతమైన నేతగా మారి జిన్‌పింగ్ పదవి నుంచి దిగిపోతారనే ఊహాగానాలు వెలువడ్డాయి. అంతర్గత రాజకీయ మార్పుల గురించి ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే, బ్రెజిల్‌లోని రియోడి జనీరోలో జరుగుతున్న ‘‘బ్రిక్స్’’ సమావేశానికి జిన్ పింగ్ హాజరుకాకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
PM Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు రోజుల అధికార పర్యటన నిమిత్తం బ్రెజిల్ లోని రియో డి జనీరోకు చేరుకున్నారు. ఆయనకు అక్కడి భారత దేశ వలసదారుల సముదాయం అత్యంత ఘన స్వాగతం పలికింది. సంప్రదాయ సంగీతం, నృత్యాలతో ప్రధానిని ఆహ్వానించారు. ముఖ్యంగా ‘ఓపరేషన్ సింధూర్’ థీమ్‌పై నిర్వహించిన నృత్య ప్రదర్శనతో సభా ప్రాంగణం మార్మోగింది. అలాగే ఇతర ప్రదర్శనలతో పాటు, బ్రెజిలియన్ సంగీత బృందం భారత ఆధ్యాత్మిక సంగీతాన్ని ప్రదర్శించడం ప్రత్యేక…