Mohammad Rizwan: ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ దారుణ పరాజయాలను మూటకట్టుకుంది. పాక్ క్రికెట్ టీం ప్రదర్శనపై సొంత దేశంలోనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పాక్ మాజీ క్రికెటర్లు జట్టుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పాక్ జట్టులో అంతర్గత రాజకీయాలు ఉన్నాయని, ఒకరంటే ఒకరికి పడటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ టోర్నీలో పసికూన యూఏఈ చేతిలో పరాజయం చూడటంతో పాటు చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఘోర పరాజయంతో పాక్ టీం స్వదేశంలో వారి ఫ్యాన్స్ నుంచి ఘోరమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ తాను విమర్శలకు అర్హులమే అని చెప్పారు. తమ ప్రదర్శన కారణంగా ఎదురవుతున్న విమర్శలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పెషావర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ విరుచుకుపడ్డారు. టీ20లో తన పేలవ ప్రదర్శనను సమర్థించుకునేందుకు ‘మతాన్ని’ కవచంలా వాడుకుంటున్నాడని షెహజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజ్వాన్ తనను తాను ‘‘ఇస్లాం బ్రాండ్ అంబాసిడర్’’గా పిలుచుకోవడాన్ని మాజీలు తప్పుబడుతున్నారు.
RAED ALSO: Air India: టీమిండియాను ఇంటికి తీసుకురావడానికి అమెరికా విమానం రద్దు.. నివేదిక కోరిన డీజీసీఏ..
‘‘ మనిషి రెండు విషయాలకు బ్రాండ్ అంబాసిడర్ అని నేను నమ్ముతాను. ఒక వ్యక్తి ముస్లిం అయితే, అతను ఎక్కడికి వెళ్లినా ఇస్లాంకు ప్రాతినిధ్యం వహిస్తాడు. రెండో విషయం ఏమిటంటే, ఎవరూ ఏం అన్నా పర్వాలేదు. తాను పాకిస్తాన్ బ్రాండ్ అంబాసిడర్’’ అని విలేకరుల సమావేశంలో రిజ్వాన్ అన్నాడు.
‘‘కొందరు ఆటగాళ్లు అనవసరంగా ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి, మతం కార్డు వేసుకుని ప్రపంచకప్‌లో తమ పేలవ ప్రదర్శనను దాచిపెట్టడం నిజంగా నిరాశ పరిచింది. తమ ఫిట్‌నెస్ గురించి అబద్ధాలు చెప్పినప్పుడు, మైదానంలో నటిస్తున్నప్పుడు మతం ఎక్కడికి పోయింది..? మతం మీకు ఇతరునలను మోసం చేసి ఫీల్డ్‌లో అబద్ధం చెప్పమని చెబుతుందా..? ఈ ఆటగాళ్లకు మరో అవకాశం ఇవ్వానలి వారు కోరుతున్నారు, అయితే ఎందుకు..? ఇది పాకిస్తాన్ టీం, వారు దీనిని స్నేహితులతో నింపేశారు, పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కోసం కాదు’’ అని షెహజాద్ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ఆటగాళ్లపై సీసీబీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జట్టులోని సీనియర్ ఆటగాళ్లందరిని తొలగించాలని షెహజాద్ బోర్డును కోరారు.