కేరళలో ప్రతీ ఐదేళ్లకు ప్రభుత్వాలు మారే సాంప్రదాయానికి తెరదింపుతో.. వరుసగా రెండోసారి విజయం సాధించింది ఎల్డీఎఫ్… దీంతో.. కేరళ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు పినరయి విజయన్… ఆయన చేత గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయించారు. సీఎం విజయన్‌తో పాటు 21 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.. కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సమయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని.. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో కోవిడ్ నిబంధనల మధ్య నిర్వహించారు.. సీపీఐ(ఎం) నేతలతో పాటు అతికొద్ది మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక, కేరళ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న మంత్రులంతా కొత్తవారే కావడం మరో విశేషం.. కరోనా విజృంభణ సమయంలో.. ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమం, సామాజిక న్యాయశాఖ మంత్రిగా వీణా జార్జి ప్రమాణం చేయగా.. సీఎం విజయ్ అల్లుడు మొహమ్మద్ రియాస్‌కు పబ్లిక్ వర్క్స్ శాఖతో పాటు టూరిజం శాఖను అప్పగించారు.. ఉన్నత విద్యాశాఖను మరో మహిళా మంత్రి ఆర్ బిందుకు కేటాయించగా.. ఆర్థికశాఖను కేఎన్ బాలగోపాలన్‌కు అప్పచెప్పారు సీఎం పినరయి విజయన్.