కేరళ గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య మరో వాగ్వాదం చోటుచేసుకుంది. కేరళ ప్రభుత్వం చట్టానికి విరుద్ధంగా చాలా పనులు చేస్తుందని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ శనివారం ఆరోపించారు.
కేరళ సీఎం పినరయి విజయన్-గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య నెలకొన్న వైరం మరింత ముదురుతోంది. శనివారం రోడ్డుపై వెళ్తుండగా ఎస్‌ఎఫ్ఐ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మరింత అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. వెంటనే కారులో నుంచి కిందికి దిగి గవర్నర్ నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్‌ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని గవర్నర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది.