Physical assault on a minor girl in Madhya Pradesh: దేశంలో రోజుకు ఎక్కడోొ చోట అత్యాచార ఘటనలు నమోదు అవుతూనే ఉన్నాయి. నిర్భయ, పోక్సో వంటి చట్టాలు ఉన్నా కూడా కామాంధుల అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. గుణ జిల్లా చచోడా గ్రామంలో ఈ దారుణం జరిగింది. సామూహిక అత్యాచారానికి బలైన బాలిక అపస్మారక స్థితిలో కనిపించింది. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
శనివారం బాధితురాలి వాగ్మూలం ఆధారంగా ఏడుగురు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 376(రేప్), గ్యాంగ్ రేప్, నేరపూరిత కుట్ర, పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేశారు. మొత్తం ఏడుగురు నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందులో ఇద్దరు మైనర్ బాలురు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Read Also: Kalvakuntla Himanshu: టీచర్ అవతారం ఎత్తిన కేసీఆర్ వారసుడు
వివరాల్లోకి వెళితే 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి రాలేదు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇంటి వెనకాల బాలిక అపస్మారస్థితిలో ఉండటాన్ని ఆమె తండ్రి గమనించాడు. మొదట బాలిక తన స్నేహితురాలు ఇంటికి వెళ్లిందని అనుకున్నామని.. ఇంటి వెనకాల పడి ఉందని మాకు కాల్ వచ్చిందని.. ఆమెను ముందుగా ప్రాథమికి ఆరోగ్య కేంద్రానికి తరలించామని.. అక్కడ నుంచి జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు బాలిక తండ్రి తెలిపాడు.
ఈ ఘటనపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ చచోడా కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ సింగ్, బీజేపీ నాయకురాలు మమతా మీనా చచోడా-బినాగంజ్ రహదారిపై శనివారం మూడు గంటలు నిరసన చేపట్టారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని గుణ సిటీ ఎస్పీ శ్వేతా గుప్తా హామీ ఇచ్చారు.