JNU: జెఎన్యూలో ఉద్రిక్తత.. పెరియార్, కార్ల్ మార్క్స్ ఫోటోలు ధ్వంసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Periyar, Karl Marx photos ‘vandalised’ at JNU: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యూ)లో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ అనుబంధం విద్యార్థి విభాగం (ఏబీవీపీ) పెరియార్, భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్, కార్ల్ మార్క్స్, జ్యోతిబా, సావిత్రీబాయి ఫూలే మొదలైన వారి ఫోటోలను ధ్వంసం చేశారని వామపక్ష విద్యార్థి విభాగం(ఎస్ఎఫ్ఐ), జెఎన్యూ విద్యార్థి సంఘం సోమవారం ఆరోపించింది. ఇది ఏబీవీపీ పనే అని జెఎన్యూఎస్యూ అధ్యక్షురాలు ఐషే ఘోష్ ట్వీట్ చేశారు. క్యాంపస్ లో మతసామరస్యానికి ఏబీవీపీ భంగం కలిగిస్తోందని ఆరోపించింది.
Read Also: Tipu Sultan Issue: టిప్పు పేరు వాడకండి.. చర్యలు తీసుకుంటామని వారసుల హెచ్చరిక
Also Read
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఈ చర్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఖండించారు. తమిళ విద్యార్థులపై దాడులకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, తమిళ విద్యార్థులకు రక్షణ కల్పించాలని వైస్ ఛాన్సలర్‌ను అభ్యర్థించారు. జెఎన్యూలో పెరియార్, కార్ల్ మార్క్స్ వంటి నాయకుల చిత్రాలను ధ్వంసం చేయడం, తమిళ విద్యార్థులపై ఏబీవీపీ దాడి చేయడం పిరికిపంద చర్య అని, అత్యంత ఖండనీయమని, యూనివర్శిటీ అడ్మిన్ దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని స్టాలిన్ ట్వీట్ చేశారు.
ఆదివారం ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటాన్ని అపవిత్రం చేయడం వెనక వామపక్ష విద్యార్థి సంఘం విద్యార్థులు ఉన్నారని.. ఏబీవీపీ ఆరోపించింది. మరోవైపు ఇటీవల ఐఐటీ బాంబేలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థికి న్యాయం చేయాలని కోరుతూ మార్చ్ చేస్తున్న విద్యార్థులపై ఏబీవీపా దాడులు చేసిందని, జెఎన్యూ విద్యార్థి సంఘం ఆరోపించింది. ఈ ఆరోపణలను ఏబీవీపీ ఖండించింది. ఈ ఘర్షణల నేపథ్యంలో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు