MK Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బుధవారం విద్యార్థులతో ముచ్చటించారు. విభజన సిద్ధాంతాలను స్వీకరించవద్దని వారిని హెచ్చరించారు. నాథూరామ్ గాడ్సే మార్గాన్ని తిరస్కరించాలని సూచించారు. ‘‘గాంధీ, అంబేద్కర్ మరియు పెరియార్ తీసుకున్న మార్గాలతో సహా మనకు అనేక మార్గాలు ఉన్నాయి. కానీ మనం ఎప్పుడూ గాడ్సే గ్రూపు మార్గాన్ని తీసుకోకూడదు’’ అని ఆయన తిరుచ్చిలోని జమాల్ మొహమ్మద్ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.
Periyar: తమిళనాట యాక్టర్ విజయ్ పార్టీ ‘‘తమిళగ వెట్రి కజగం(టీవీకే)’’ సంచలనంగా మారింది. ఆదివారం విల్లుపురం వేదికగా జరిగిన తొలి సభకే దాదాపుగా 8 లక్షల మంది హాజరు కావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్న్నికలే టార్గెట్‌గా విజయ్ పావులు కదుపుతున్నాడు.
Periyar, Karl Marx photos ‘vandalised’ at JNU: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యూ)లో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ అనుబంధం విద్యార్థి విభాగం (ఏబీవీపీ) పెరియార్, భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్, కార్ల్ మార్క్స్, జ్యోతిబా, సావిత్రీబాయి ఫూలే మొదలైన వారి ఫోటోలను ధ్వంసం చేశారని వామపక్ష విద్యార్థి విభాగం(ఎస్ఎఫ్ఐ), జెఎన్‌యూ విద్యార్థి సంఘం సోమవారం ఆరోపించింది.