Maharashtra: స్థానిక ఎన్నికల కోసం ఒక్కటైన పవార్ కుటుంబం.. చేతులు కలిపిన శరద్ పవార్-అజిత్ పవార్
- ఆసక్తిరేపుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు
- స్థానిక ఎన్నికల సమయంలో ఒక్కటైన పవార్ కుటుంబాలు
- కలిసి పోటీ చేయాలని శరద్ పవార్-అజిత్ పవార్ నిర్ణయం
- గత వారం ఉద్ధవ్ థాక్రే-రాజ్ థాక్రే కలయిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర స్థానిక ఎన్నికల సమయంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్థానిక ఎన్నికల కోసం శరద్ పవార్-అజిత్ పవార్ కుటుంబాలు మళ్లీ ఏకమయ్యాయి. ముంబై, పింప్రి-చించ్‌వాడ్, పూణె సహా మహారాష్ట్ర అంతటా 29 మునిసిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 16న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక డిసెంబర్ 30న నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ. ఈ నేపథ్యంలో పింప్రి-చించ్‌వాడ్‌లో కలిసి పోటీ చేయాలని శరద్ పవార్-అజిత్ పవార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇద్దరూ చేతులు కలిపారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. ఈ కొత్త కూటమికి తన బాబాయ్ శరద్ పవార్ నాయకత్వం వహిస్తారని తెలిపారు.
ఇది కూడా చదవండి: CM Revanth ShakeHands KCR: అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం.. కేసీఆర్కి షేక్హ్యాండ్ ఇచ్చిన సీఎం రేవంత్
Also Read
- Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
- Bangladesh: షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్ వస్తాడంట.. బంగ్లాదేశ్ ప్రధాని షరతు..
- CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
- Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
మొత్తానికి పవార్ కుటుంబంలో నెలకొన్న విభేదాలు.. తిరిగి స్థానిక ఎన్నికల రూపంలో మళ్లీ కలిపింది. ప్రస్తుతం పింప్రి-చించ్‌వాడ్‌లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పూణె మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కలిసి పోటీ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం పొత్తులపై చర్చలు జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి: China-Taiwan: చైనా-తైవాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. డ్రాగన్ దళాలు భారీ విన్యాసాలు
ఇదిలా ఉంటే ముంబై మున్సిపల్ ఎన్నికల కోసం శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్ థాక్రే ఇప్పటికే ఒక్కటయ్యారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు గత వారం సంయుక్తంగా ప్రకటించారు. బీఎంసీ మేయర్ పీఠం తమదేనని వెల్లడించారు. ఈ కుటుంబాల కలయిక మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పు తీసుకువస్తుందనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు పెడతా.. కేసీఆర్‌ను కూడా తీసుకురండి
-
IND Vs SL: మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్.. రెండో రోజు ముగిసిన ఆట..
-
Visaka Airport: 40 ఏళ్ల నాటి అనుబంధం నేటితో ముగింపు.. భావోద్వేగంతో వీడ్కోలు..
-
CM Revanth Reddy : పరకాలకు సీఎం రేవంత్ వరాలు.. రూ.400 కోట్లకు పైగా అభివృద్ధి పనులు.!
-
Yash Rejected 7 Films: 7 సినిమాలు వదులుకున్న యశ్.. మనీ విషయంలో రాకింగ్ స్టార్ ఫార్ములా ఇదేనట!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?