Waqf Bill: వక్ఫ్ బిల్లు సవరణను నిర్వీర్యం చేయడానికి పాకిస్తాన్, చైనా కుట్ర..?
- వక్ఫ్ సవరణ బిల్లుపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు..
- వక్ఫ్ బిల్లు సవరణను నిర్వీర్యం చేయడానికి పాకిస్తాన్
- చైనా కుట్ర..
- నిషికాంత్ దూబేపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf Bill: వక్ఫ్ (సవరణ) బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి అందిన 1.25 కోట్ల సమర్పణలపై విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కోరారు. దీని వెనక వాంటెడ్ ఇస్లామిస్ట్ బోధకుడు జకీర్ నాయక్, పాకిస్తాన్ ఐఎస్ఐ, చైనాల పాత్ర ఉందని అతడు అనుమానించారు. ఈ సందర్భంగా జేపీసీ చైర్మన్ కు లేఖ రాశారు. పార్లమెంటరీ ప్యానెల్‌కు వచ్చిన ఈమెయిల్స్ పై తక్షణమే కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో దర్యాప్తు చేయాలని కోరారు. విదేశీ సంస్థలు, వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను తారుమారు చేయడానికి ప్రతిస్పందనల వరదను సృష్టించారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే పేర్కొన్నారు.
Read Also: AP and Karnataka: ఆరు అంశాలపై ఏపీ, కర్ణాటక మధ్య ఒప్పందం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడి..
Also Read
- Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
- Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
- Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: కాక్రోచ్ ఉద్యమం ఎటు పోతోంది.? పేపర్ లీక్‌పై నిరసన అయితే దాడులు, విద్వేష నినాదాలు ఎందుకు.?
అయితే, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే వ్యాఖ్యలపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. తాము ఊహించిన రీతిలోనే ప్రతిస్పందనలు వచ్చాయని తెలిపింది. ఎన్డీయే ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని మార్చాలని ప్రతిపాదించడంతో విపక్షాలు ఆందోళన తీవ్ర తరం చేయడంతో.. ఆగస్టులో జేపీసీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వివాదాస్పద అంశానికి సంబంధించి ప్రజలు, ఎన్జీఓలు, నిపుణులతో పాటు ఇతరుల నుంచి పార్లమెంటరీ ప్యానెల్‌కు ( 4.85 ) కోట్ల ఇమెయిల్‌లు వచ్చాయని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ వెల్లడించింది.
Read Also: Ponnam Prabhakar: ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్.. మొదటి అభ్యర్థన స్వీకరించిన మంత్రి పొన్నం
కాగా, మోడీ సర్కార్ జూలై 28న పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశ పెట్టింది. ఈ బిల్లు వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు, ముస్లిం మహిళలను చేర్చాలని ప్రతిపాదించింది. ఆస్తిని వక్ఫ్‌గా ప్రకటించే అధికారాన్ని బోర్డు నుంచి తొలగించింది. అయితే, దీనిపై ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో ఈ బిల్లును బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలో ఆగస్టు 8న జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. గత నెలలో ఈ అంశంపై ప్రజలు తమ అభిప్రాయాలను సమర్పించాలని జేపీసీ కోరింది.
తాజావార్తలు
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!