Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
- నిరాహార దీక్ష విరమించేందుకు సిద్ధమైన సోనమ్ వాంగ్‌చుక్.
- యువ నిరసనకారులపై చర్యలు ఉండవని హామీ కావాలని షరతు.
- నడ్డా, జితేంద్ర సింగ్‌కు లేఖ రాసిన వాంగ్‌చుక్.
- హామీ లేకపోతే నిరవధిక దీక్ష కొనసాగిస్తానని స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonam Wangchuk: నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తన కేంద్ర ప్రభుత్వానికి కొన్ని షరతులు విధించారు. ఆస్పత్రిలో తనను పరామర్శించి నిరాహారదీక్ష విరమించాలని కోరిన కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు వాంగ్‌చుక్ లేఖ రాశారు. చర్చల సందర్భంగా తన డిమాండ్లలో కొన్నింటిని సానుకూలంగా పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు.
పేపర్ లీక్ తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వాలని , విద్యాశాఖ మంత్రి రాజీనామాను కూడా పరిగణలోకి తీసుకోవాలని, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి పార్లమెంట్లో చర్చ జరగాలని వాంగ్‌చుక్ తన లేఖలో డిమాండ్ చేశారు. చలో పార్లమెంట్ మార్చ్‌పై పోలీసుల బలప్రయోగం జరిగినప్పటికీ ప్రదర్శన అత్యంత శాంతియుతంగా కొనసాగిందని ఆయన అన్నారు. నిరసనకారుల సహనం, నిబద్ధత దేశం, ప్రపంచం చూసిందని అన్నారు. ప్రదర్శనలో పాల్గొన్న వారిపై చట్టబద్ధమైన కేసులు, వేధింపులు, ప్రతీకార చర్యలు ప్రజాస్వామ్య సంస్థలపై విశ్వాసాన్ని మరింత దెబ్బతీస్తాయని వాంగ్‌చుక్ తన లేఖలో పేర్కొన్నారు.
Also Read
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
కేంద్రమంత్రుల సమావేశం తర్వాత, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 65 మంది ఎంపీలు కూడా తన నిరాహార దీక్షను విరమించాలని కోరతూ లేఖ రాసినట్లు వాంగ్‌చుక్ తెలిపారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, యువతపై ఎలాంటి చర్యలు తీసుకోమని, కేసులు పెట్టబోమని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీని కోరారు. ప్రభుత్వం నుంచి ఈ హామీలు లభిస్తే నిరాహారదీక్ష విరమిస్తానని చెప్పారు. హామీ లభించకపోతే నిరవధికంగా నిరాహారదీక్ష కొనసాగిస్తానని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!