BJP MP: తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఆయన పాకిస్తాన్‌కి వార్నింగ్ ఇచ్చారు. 2025 నాటికి పాకిస్తాన్ ఒక దేశంలో ఉనికిలో లేకుండా పోతుందని చెప్పారు. ఆదివారం, ఆదివారం జార్ఖండ్‌లోని దేవఘర్ జిల్లాలో మహేశ్‌మార రైల్వే హాల్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ సంవత్సరం పాకిస్తాన్ 4 ముక్కలు అవుతుందని అన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడిపై బీహార్‌లో ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ఉగ్రవాదులను ప్రపంచం అంచున ఉన్న వేటాడుతామని, వారి మద్దతుదారులను కూడా విడిచిపెట్టమని అన్నారు. ప్రధాని వ్యాఖ్యలపై దూబే మాట్లాడుతూ.. ఆయన ఉగ్రవాదుల్ని నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేశారు, ఇది పాకిస్తాన్ విచ్ఛిన్నానికి దారి తీస్తుందని చెప్పారు. ‘‘పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)ని భారత్ తిరిగి పొందుతుందని, పాకిస్తాన్ బెలూచిస్తాన్, ఫఖ్తునిస్తాన్, పంజాబ్ అనే 4 దేశాలుగా విభజించబడుతుంది’’ అని చెప్పారు.
Read Also: Minister Ponguleti: కాంగ్రెస్‌ని విలన్‌గా చిత్రీకరించే పనిలో కేసీఆర్ ఉన్నారు..
‘‘నేను పూర్తి విశ్వాసంతో చెబుతున్నాను, ఈ ఏడాది చివరి నాటికి పాకిస్తాన్ ముక్కలు కాకుంటే, బీజేపీ తప్పుడు వాగ్దానాలు చేస్తుందని మీరు ఆరోపించవచ్చు. పాకిస్తాన్ అంతమవుతుంది. ఇది నరేంద్రమోడీ హామీ. ఈ నమ్మకమే ఆయనను దేశ ప్రధానిని చేసింది’’ అని దూబే అన్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి మాట్లాడుతూ.. పాకిస్తాన్ సైన్యం భారతీయులు, ముఖ్యంగా హిందువుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని ఆరోపించారు. ఈ దాడికి మోడీ ప్రభుత్వం ఎంత మూల్యానికైనా ప్రతీకారం తీర్చుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ సామర్థ్యం కారణంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుందని దూబే ప్రశంసించారు.