Operation Sindoor: కుటుంబ సభ్యుల్ని చంపితే ఎలా ఉంటుందో పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇప్పుడు తెలిసి వస్తోంది. పహల్గామ్‌లో అమాయకులైన 26 మందిని చంపి, వారి కుటుంబాల్లో తీరని వేధనను మిగిల్చిన ముష్కరులకు ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ ధీటుగా బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సిందూర్‌లో భారత్, పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
Hafiz Saeed: లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ఉగ్రవాది మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించడానికి పాకిస్తాన్‌కు అభ్యంతరం లేదని పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు. విశ్వాసాన్ని పెంపొందించే చర్యగా దీనిని అభివర్ణించారు. అయితే, బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై హఫీజ్ సయీద్ కొడుకు, ఉగ్రవాది తల్హ సయీద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భుట్టో్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్‌కు అవమానం తెచ్చిపెట్టేలా ఉన్నాయని అన్నారు.
India vs Pakistan: ఆపరేషన్ సింధూర్ కి భంగపడ్డ పాకిస్తాన్ భారత్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టుకునేందుకు అమెరికాలో పర్యటిస్తున్న బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాక్ అఖిలపక్ష బృందానికి అనూహ్య పరిణామం ఎదురైంది.
SCO Meeting: షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి గోవా ఆతిథ్యం ఇవ్వనుంది. మే 4-5 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలను పరిశీలించేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం గోవాలకు చేరుకున్నారు. ఎస్‌సీఓ సభ్యదేశాల్లో ఒకటైన పాకిస్తాన్ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా ఈ సమావేశాలకు హాజరుకానున్నారు.
Pakistan: కాశ్మీర్ అంశాన్ని ఎజెండాగా చేయాలని పాకిస్తాన్ భావిస్తోంది. మే 4-5 తేదీల్లో గోవాలో షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సభ్యదేశాలు విదేశాంగ మంత్రుల సమావేశం జరగబోతోంది. ఇదిలా ఉంటే ఈ సమావేశానికి పాకిస్తాన్ తరుపున ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరుకాబోతున్నారు. 2014 తర్వాత ఓ పాకిస్తాన్ నాయకుడు భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. పాకిస్తాన్ తో పాటు చైనా, రష్యాతో పాటు కజకిస్తాన్, కర్గిజ్ స్తాన్, ఉజ్బెకిస్తాన్,…
SCO Foreign Ministers Meeting: గోవాలో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చే నెలలో తమ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్‌కు వస్తారని పాకిస్థాన్ గురువారం ప్రకటించింది. వచ్చే నెలలో 4-5 తేదీల్లో గోవా వేదికగా ఈ సమావేశం జరగబోతోంంది. దీనికి పాకిస్తాన్ తరుపును ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో నేతృత్వంలో ప్రతినిధి బృందం భారత్ రానుంది. దాదాపుగా తొమ్మిదేళ్ల అనంతరం ఓ…
Bilawal Bhutto Zardari: జమ్మూ కాశ్మీర అంశాన్ని పాకిస్తాన్ పలు వేదికలపై ప్రస్తావిస్తోంది. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి సాధారణ, భద్రత మండలిలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు పాక్ ప్రతినిధులు. ముఖ్యంగా పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్ధానీ జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ ను విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోసారి బిలావల్ భుట్టో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. తాను కాశ్మీర్ అంశాన్ని ముఖ్యమైన ఎజెండాగా చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఎజెండాతో సంబంధం లేకుండా ప్రతీ ఐక్యరాజ్యసమితి…
India at UN: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తింది. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ జమ్మూ కాశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగానే స్పందించింది. మహిళలు, శాంతి మరియు భద్రతపై భద్రతా మండలి చర్చలో పాక్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ మానవహక్కులపై తప్పుడు ఆరోపణలు చేసింది. ఈ వ్యాఖ్యలపై భారత్ విరుచుకుపడింది. ఇటువంటి ద్వేషపూరిత, తప్పుడు ప్రచారాలకు భారత్ స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
Pakistan Foreign Minister's Controversial Comments on Prime Minister Modi: భారత ప్రధాని నరేంద్రమోదీపై పాకిస్తాన్ విదేశాంగశాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్ధారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూఎన్ భద్రతా మండలిలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని తూర్పారపట్టారు. ఒసామా బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదికి పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చిందని.. ఇటువంటి దేశం ఉగ్రవాదంపై నీతులు చెబుతుందని విమర్శించారు.