Abhishek banerjee: మేము అధికారంలోకి వస్తే, వారి ఇళ్లలోకి వెళ్లి చంపేస్తాం..
- పాకిస్తాన్ వెళ్లి చంపేస్తాం..
- ఎంపీ అభిషేక్ బెనర్జీ వార్నింగ్..
- పాక్ రక్షణమంత్రి వ్యాఖ్యలపై టీఎంసీ..
- బీజేపీ మౌనంపై మమతా బెనర్జీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారుతోంది. టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఇప్పుడు, పాకిస్తాన్ కేంద్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. మరోసారి భారత్ దాడి చేస్తే, కోల్‌కతాపై దాడులు చేస్తామని పాకిస్తాన్ బలుపు మాటలు మాట్లాడుతోంది.
ఈ వ్యాఖ్యలపై మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ విరుచుకుపడ్డారు. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కోల్‌కతాపై దాడులు చేస్తామని హెచ్చరించినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. ‘‘ఇండియా కూటమి, మమతా బెనర్జీ కేంద్రంలో అధికారంలోకి వస్తే, పాకిస్తాన్లో వారి ఇళ్లలోకి వెళ్లి దాడులు చేస్తాం’’ అంటూ అభిషేక్ హెచ్చరించారు.
Also Read
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
- Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
- SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
Read Also: Kevin Pietersen: ‘ఐపీఎల్ వల్ల నా కెరీర్ నాశనమైంది’.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన ప్రకటన
మరోవైపు, టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ కూడా పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేంద్రంపై మండిపడ్డారు. కోల్‌కతా వంటి నగరంపై దాడులు చేస్తామని బెదిరిస్తుంటే, కేంద్రం స్పందించకపోవడం బాధాకరమని ఆమె అన్నారు. ఎన్నికల సమయంలోనే బీజేపీ బెంగాల్‌ను గుర్తు చేసుకుంటుందని, ప్రజల భద్రతను పట్టించుకోదని ఆమె ఆరోపించారు.
పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. భారతదేశం తమపై దాడులకు పాల్పడితే, పాకిస్తాన్ త్వరగా, కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. కోల్‌కతా లక్ష్యంగా దాడులు చేస్తామని హెచ్చరించారు. దీనికి ముందు, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ ఇంకా ఆన్‌లోనే ఉందని, పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!