Kevin Pietersen: ‘ఐపీఎల్ వల్ల నా కెరీర్ నాశనమైంది’.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kevin Pietersen: ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ జోరుగా సాగుతోంది. ఎలాగైన కప్పు కొట్టాలని అన్ని జట్లు పోటీ పడుతున్నాయి. అభిమానులు సైతం మ్యాచులు చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ తరుణంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తన అంతర్జాతీయ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోవడం వెనుక ఐపీఎల్ పాత్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో పాల్గొనే విషయంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB)తో వచ్చిన విభేదాలే తన కెరీర్‌ను బలి తీసుకున్నాయని ఆరోపించాడు. ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీటర్సన్ మాట్లాడుతూ.. ఐపీఎల్ ప్రారంభ రోజుల్లో తనపై ఈసీబీ ఒక రకమైన ‘విచారణ’ (witch-hunt) జరిపిందని, మీడియాను ఉపయోగించుకుని తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని పేర్కొన్నాడు.
READ MORE: Amaravati Capital: ఏపీ రాజధాని అమరావతి.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం
Also Read
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లను ఈసీబీ అనుమతించలేదు. కేవలం డిమిత్రి మస్కరేనస్ మాత్రమే ఆ ఏడాది ఆడగలిగారు. 2009లో మూడు వారాల పరిమిత సమయం ఇచ్చినా, తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాధాన్యత ఇవ్వడం బోర్డుకు నచ్చలేదని పీటర్సన్ వెల్లడించాడు. “నేను పెద్ద త్యాగాలే చేశాను.. నా కెరీర్‌ను కోల్పోయాను. వ్యవస్థలోని వారంతా నాకు వ్యతిరేకం కావడానికి కారణం అదే. 33 ఏళ్ల వయసులో నా ఇంగ్లండ్ కెరీర్ ముగిసింది.” అని ఆవేదన వ్యక్తం చేశాడు. 104 టెస్టులు ఆడి 33 ఏళ్లకే కెరీర్ ముగించాల్సి వచ్చిందని, నిజానికి తాను 150-160 టెస్టులు ఆడి 12,000 నుంచి 13,000 పరుగులు సాధించాల్సిందని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. “ఈసీబీ నాపై దాడి చేయడానికి ‘ది టెలిగ్రాఫ్’ను ఉపయోగించుకుంది. నేను దాని గురించి మరీ లోతుగా వెళ్లాలనుకోవడం లేదు. ఆ వార్తలు బాగా ప్రచారమయ్యాయి. పర్వాలేదు.. నేను ఇప్పుడు చాలా సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాను.” అని పీటర్సన్ తెలపాడు. ఇక పీటర్సన్ కేరీర్ విషయానికి వస్తే.. తన టెస్ట్ కెరీర్‌ను 23 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలతో సహా 8,181 పరుగులు సాధించాడు.
తాజావార్తలు
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
-
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!