దక్షిణాఫ్రికాతో కోల్‌కతాలో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. స్వల్ప ఛేదనలో భారత్ ఆలౌట్ అయింది. దాంతో పిచ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నేపథ్యంలో భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో స్పిన్ పిచ్‌లను ఇప్పుడే కొత్తగా తయారు చేయడం లేదని, కొన్ని దశాబ్దాలుగా ఇదే జరుగుతోందన్నాడు. ఎప్పటి నుంచో స్పిన్ పిచ్‌లు ఉన్నాయని, అప్పుడు ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదని భువీ ప్రశ్నించాడు. ఆటలో గెలుపోటములు భాగం అని భువీ పేర్కొన్నాడు.
‘భారత్‌లో స్పిన్ పిచ్‌లు సిద్ధం చేయడం ఇప్పుడు కొత్త కాదు. కొన్ని కొన్ని దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోంది. భారత్ గెలుస్తున్నంత కాలం ఎవరూ ప్రశ్నించలేదు. ఆటలో గెలుపోటములు సహజం. గతంలో టీమిండియా ఎప్పుడూ ఓడిపోకుండా లేదు. ఇదే మొదటి పరాయజం కూడా కాదు. ఈ ఓటమితో పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉన్నపుడు నలుగురు స్పిన్నర్లతో ఆడడం తప్పు లేదు. కోల్‌కతాలో టర్నింగ్ ట్రాక్. మ్యాచ్ జరిగిన విధానాన్ని బట్టి చూస్తే.. భారత్ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగడంలో తప్పేం లేదు’ అని భువనేశ్వర్ కుమార్ వివరించాడు.