Train Accident: మహారాష్ట్రలోని గోండియాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ప్యాసింజర్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి పైగా గాయపడ్డారు. గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో తెల్లవారుజామున 2.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు ప్యాసింజర్ రైలు వెళ్తోంది.
Colleague Hugging: కౌగిలించుకున్నాడంటూ కోర్టుకెక్కిన మహిళ.. భారీ జరిమానా విధించిన న్యాయమూర్తి..
సమాచారం ప్రకారం, సిగ్నలింగ్ సమస్యల కారణంగా ఈ సంఘటన జరిగింది. డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేక్ వేసినా గూడ్స్ రైలును ఢీకొనడంతో తప్పించుకోలేకపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఎటువంటి మరణాలు సంభవించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.