‘నా జీవితం మారిపోయింది’ అని సైఫ్ అలీ ఖాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ అంటున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనను ఆసుపత్రికి తీసుకువెళ్లిన ఆటో రిక్షా డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిశాడు, అతనికి ఆర్థిక సహాయం కూడా అందించాడు. గత వారం ముంబైలోని తన నివాసంలో కత్తితో దాడికి గురైన సైఫ్ అలీఖాన్‌ను భజన్ సింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, రానా మాట్లాడుతూ, సైఫ్ అలీ ఖాన్ సకాలంలో…
Farooq Abdullah: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి గురించి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా స్పందించారు. సైఫ్‌పై దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశీయుడు కాబట్టి, మొత్తం బంగ్లాదేశ్‌ని నిందించలేమని బుధవారం అన్నారు.
దాడి కారణంగా హాస్పిటల్ లో జాయిన్ అయిన సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు ఇంటికి వచ్చాడు. నటుడు మంగళవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. గత వారం, బుధవారం అర్ధరాత్రి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి అతనిపై దాడి చేశారు. నటుడికి 2 శస్త్రచికిత్సలు జరిగాయి. ఇప్పుడు మంగళవారం ఒక అప్డేట్ తెర మీదకు వచ్చింది. అదేమంటే సైఫ్ గట్టి పట్టు నుండి తనను తాను విడిపించుకోవడానికి నిందితులు నటుడిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి తర్వాత,…
ఇదిలా ఉంటే, ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కి చెందిన ఒక అనుమానితుడిని ముంబై పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఈ రోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. నటుడిపై దాడి జరిగి రెండు రోజులు గడుస్తున్నా.. దుండగుడి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగి దాదాపుగా ఒకటిన్నర రోజు కావస్తోంది. అయితే, ఇప్పటికీ 5 ప్రశ్నలకు మాత్రం సమాధానం లభించడం లేదు. ఆయనపై దాడి ఘటన మొత్తం చిత్రపరిశ్రమనే షాక్‌కి గురిచేసింది. ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆయనపై కత్తితో దాడి చేసి 6 చోట్ల గాయపరిచాడు. ఆటోలో లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం సైఫ్ పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు.
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటన దేశంలో చర్చనీయాశంగా మారింది. ఇంట్లోకి దూరిన దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే అతడిని లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత దుండగుడు ఫైర్ ఎస్కేప్ మెట్ల ద్వారా పారిపోవడం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
Saif Ali Khan Attack : సైఫ్ అలీ ఖాన్ అభిమానులకు శుభవార్త. సైఫ్ అలీ ఖాన్‌ను ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డుకు తరలించారు. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నాడని, వారం రోజుల్లో కోలుకుంటాడని వైద్యులు చెప్పారు.