Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లో చీలిక లేదని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శదర్ పవార్ తెలిపారు. పార్టీలో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహారిస్తున్నామని తెలిపారు. తమ పార్టీకి చెందిన అజిత్ పవార్ పార్టీ నుంచి వీడిపోయి బీజేపీతో జతకట్టి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల తరువాత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శరద్ పవార్ ఈ అంశంపై స్పందించారు. మహారాష్ట్రలో బీజేపీ పార్టీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించిన అజిత్ పవార్ ఇప్పటికీ తమ పార్టీకి చెందిన వారేనని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. ఆయన రాజకీయంగా మాతో విభేదించినంత మాత్రాన మా పార్టీలో చీలిక వచ్చిందని ఎలా అంటారని ప్రశ్నించారు. కొల్హాపూర్ వెళ్లేముందు పూణే బారామతిలోని తన నివాసంలో శరద్ పవార్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీలో ఎలాంటి చీలిక రాలేదని తాము ఇప్పటికీ కలిసే ఉన్నామని తెలిపారు. అజిత్ పవార్ పార్టీకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంపై మేము అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని.. అయితే సభాపతి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని ఎన్‌సీపీలో చీలిక వచ్చిందని ఎలా చెబుతారని ప్రశ్నించిన ఆయన.. అజిత్ పవార్ ఇప్పటికీ తమ పార్టీకి చెందినవారేనని అన్నారు.
Read Also: Rakul Preet Sing: తెలుగు అమ్మయి కాస్ట్యూమ్ తో అలరిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్
“పార్టీ నుండి మెజారిటీ సభ్యులు బయటకు వెళ్లడం ఇష్టం లేదు, కొంతమంది భిన్నమైన వైఖరిని తీసుకున్నారు, ప్రజాస్వామ్యం అలా చేయడానికి అనుమతిస్తుంది, ఇది పార్టీలో చీలిక కాదు,” అని శరద్ పవార్ అన్నారు. శరద్ పవార్ కుమార్తె మరియు బారామతి ఎంపి సుప్రియా సూలే మాట్లాడుతూ పార్టీ ఐక్యంగా ఉందని, బిజెపితో పొత్తు లేదని తన తండ్రి చేసిన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. “మా అధ్యక్షుడు శరద్ పవార్ మరియు మా రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్. ప్రస్తుతానికి మా పార్టీ స్థితి అది. మా పార్టీ బిజెపితో ఏ రూపంలోనూ పొత్తులో లేదు. మా పార్టీ సభ్యులు కొందరు వేరే నిర్ణయం తీసుకున్నారు. వేర్వేరు స్టాండ్ మరియు ప్రక్రియ ప్రకారం మేము మా అభిప్రాయాలను మరియు ఇన్‌పుట్‌లను స్పీకర్‌తో పంచుకున్నాము, ”అని శ్రీమతి సులే చెప్పారు. “ఇప్పుడు, అతను (అజిత్ పవార్) పార్టీకి వ్యతిరేక వైఖరిని తీసుకున్నాడు మరియు మేము అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసాము మరియు అతని ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తున్నాము” అని ఆమె తెలిపారు. జాతీయ స్థాయిలో భారీ సంఖ్యలో నాయకులు పార్టీ నుండి వేరైతే దాన్ని పార్టీలో చీలిక రావడమంటారు. మా పార్టీలో అలాంటిదేమీ జరగలేదు కదా. కొంతమంది మా పార్టీని విడిచి వెళ్లారు. మరికొంతమంది రాజకీయంగా మాతో విభేదించారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు అందరికీ ఉంటుందని శరద్ పవార్ స్పష్టం చేశారు. తాను సర్వేలు ఇంకా అధ్యయనం చేయలేదని.. కానీ ఎన్సీపీ- శివసేన(యూబీటీ) మహా వికాస్ అఘాడిపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తోపాటు మరికొన్ని పార్టీలతో కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కంటే మెరుగ్గా రాణిస్తుందని శరద్ పవార్ మీడియాకు తెలిపారు.