ఒడిశాలో విద్యార్థిని ఆత్మహత్యపై నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కాలేజీ లెక్చరర్ వేధింపులకు తాళలేక 20 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం బీజేడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు.
పంజాబ్-హర్యానా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శంభు సరిహద్దు నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు రైతులు యత్నిస్తున్నారు. రైతులపై పోలీసులు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. టియర్ గ్యాస్ షెల్స్ వల్ల 17 మంది రైతులు గాయపడ్డారు. ఆ తర్వాత తోటి రైతులు గాయపడిన వాళ్లను స్ట్రెచర్లపై ఆస్పత్రికి తరించారు. కాగా.. ప్రస్తుతం 101 మంది రైతుల బృందం ఢిల్లీ మార్చ్‌ను విరమించుకుంది. మరోవైపు అంబాలాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని హర్యానా…
Nabanna Abhijan protest: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన అక్కడి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘాలు ‘పశ్చిమబంగా ఛాత్రో సమాజ్’ ఇవాళ (మంగళవారం) నిరసన చేపట్టింది.
తమ డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వరుసగా మూడో రోజు కూడా ఆందోళనలకు దిగుతామని రైతులు హెచ్చరించారు.
Another Tear Gas Attack on Farmers: ‘ఢిల్లీ చలో’ మార్చ్ నిరసన కార్యక్రమంలో భాగంగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఉన్న రైతులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం జరిగింది. మంగళవారం ఉదయం పంజాబ్-హర్యానా సరిహద్దు పాయింట్ల వద్ద పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ ఘటనలో 60 మంది రైతులు గాయపడ్డారని తెలుస్తోంది. పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు దేశ రాజధాని లోపలి వెళ్లేందుకు బారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నించడంతో రెండు సరిహద్దు పాయింట్ల…
మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థుల హత్యకు వ్యతిరేకంగా నిరసనలు బుధవారం ఉదయం తీవ్రమయ్యాయి, ఇంఫాల్‌లో పోలీసు సిబ్బందితో ప్రదర్శనకారులు ఘర్షణకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేసి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.
Bolivia Clashes : బొలీవియాలో బీభత్సం కొనసాగుతోంది. స్థానిక గవర్నర్ అరెస్టును ఖండిస్తూ ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.