Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్.
- విచారణ అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం.
- రిమాండ్ కోరబోమని కోర్టుకు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం.
- అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే ఆందోళనలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udhayanidhi Stalin: సినీ నటి త్రిషను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కేసులో అరెస్టైన తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టు ఊరటనిచ్చింది. విచారణ పూర్తయ్యాక వెంటనే స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాలని తమిళనాడు పోలీసుల్ని ఆదేశించింది. కావేరీ జల వివాదం నేపథ్యంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి విజయ్ను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు భావించి ఉదయనిధిపై కేసు నమోదు చేశారు. హైడ్రామా నడుమ ఆయనను అరెస్ట్ చేశారు.
ఉదయనిధి అరెస్ట్ తర్వాత ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఉదయనిధిని తంజావూర్ తరలించినప్పటికీ, ఆయనను న్యాయస్థాన రిమాండ్‌కు పంపే ఉద్దేశం లేదని కేవలం విచారణ నిర్వహించి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేస్తామని తమిళనాడు అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ కోర్టు తెలిపారు. విచారణ అనంతరం అదే రోజు ఉదయనిధిని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
Also Read
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
- UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే, ఉదయనిధి అరెస్ట్‌పై తమిళనాడు వ్యాప్తంగా డీఎంకే శ్రేణులు ఆందోళనకు దిగారు. పలుచోట్ల రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు డీఎంకే అధ్యక్షుడు ఎం.కే స్టాలిన్ అత్యవసర భేటీ నిర్వహించి, తదుపరి కార్యచరణపై చర్చించారు. ఈ కేసులో అసభ్య పదజాలం వినియోగం, మహిళ గౌరవాన్ని అవమానించడం, విద్వేషాన్ని రెచ్చగొట్టడం, అల్లర్లకు ప్రేరేపించడం, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించిన పలు సెక్షన్ల కింద ఉదయనిధిపై కేసులు నమోదు చేశారు. తాను సీఎం విజయ్ పేరు తప్పా, మరెవరి పేరు ప్రస్తావించలేదని ఉదయనిధి మీడియాతో అన్నారు. మరోవైపు, టీవీకే ఉదయనిధి వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది.
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!