Manipur: గత రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రం జాతుల మధ్య ఘర్షణలతో మండిపోతోంది. మైయిటీ, కూకీల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి వెళ్లాయి. ఇదిలా ఉంటే గురువారం మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెళ్లారు. అయితే ఆయన పర్యటనపై ఆల్ మణిపూర్ స్టూడెంట్ యూనియన్(AMSU) ఆగ్రహం వ్యక్తం చేసింది.