ఒడిషాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటనకు ప్రధాన కారణం రాంగ్ సిగ్నలింగ్ అని ఉన్నత స్థాయి విచారణ కమిటీ స్పష్టం చేసింది. భద్రతా ప్రమాణాలు పాటిస్తే దుర్ఘటన జరిగి ఉండేది కాదని కమిటీ నివేదికలో పేర్కొంది. ఒడిషా ఘోర రైలు ప్రమాదంపై రైల్వే బోర్డుకు సేఫ్టీ కమిషన్ తన నివేదికను సమర్పించింది.