Chips Packet: 4 ఏళ్ల బాలుడి ప్రాణాలు తీసిన చిప్స్ ప్యాకెట్..
- 4 ఏళ్ల బాలుడి ప్రాణాలు తీసిన చిప్స్ ప్యాకెట్..
- చిప్స్ ప్యాకెట్‌లోని బొమ్మను మింగడంతో మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chips Packet: చిన్న పిల్లలకు తల్లిదండ్రులు చిప్స్ ప్యాకెట్లు కొనిపెట్టడం సహజం. కొనాలని పిల్లలు మారాం చేస్తుంటారు. కానీ ఒక్కోసారి అవి కూడా ప్రాణాలు తీస్తాయని ఈ ఘటన హెచ్చరించింది. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో చిప్స్ ప్యాకెట్‌లో వచ్చిన మినియేచర్ బొమ్మను మింగడంతో నాలుగేళ్ల బాలుడు మరణించాడని పోలీసులు బుధవారం తెలిపారు. ఈ సంఘటన దరింగ్ బాడి బ్లాక్‌లోని బ్రహ్మణి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసుమహపాడ గ్రామంలో చోటుచేసుకుంది. మరణించిన బాలుడిని రంజిత్ ప్రధాన్ కుమారుడు బిగిల్ ప్రధాన్‌గా గుర్తించారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
బాలుడి తండ్రి తన కొడుకు కోసం చిప్స్ ప్యాకెట్ తీసుకువచ్చాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్యాకెట్‌లో చిన్న ప్లాస్టిక్ బొమ్మ తుపాకీ వచ్చింది. బాలుడు చిప్స్ తింటుండగా, తల్లిదండ్రులు తమ పనుల్లో నిగ్నమై ఉన్నారు. అయితే, అనుకోకుండా చిప్స్ అని భావించిన పిల్లాడు బొమ్మను తినేందుకు ప్రయత్నించాడు. బాలుడి గొంతులో బొమ్మ అడ్డుపడటంతో ఏడ్చడం ప్రారంభించాడు. తల్లిదండ్రులు బొమ్మను తీసేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. బాలుడిని 30 కి.మీ దూరంలో ఉన్న దరింగ్ బాడీ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. చిప్స్ ప్యాకెట్‌లోని బొమ్మ బాలుడి వాయునాళాన్ని అడ్డుకుందని వైద్యులు చెప్పారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!