Rahul Gandhi: రాహుల్‌గాంధీకి షాక్.. నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ
- రాహుల్‌గాంధీకి షాక్
- నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ
- పరువు నష్టం కేసులో కోర్టు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి భారీ షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో ఆయన చిక్కుల్లో పడ్డారు. జార్ఖండ్‌లోని చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు రాహుల్‌గాంధీకి నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది. జూన్ 26న కోర్టు ముందు స్వయంగా హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. పదే పదే విచారణకు హాజరుకాకపోవడంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.
ఇది కూడా చదవండి: Genelia : తృటిలో తప్పిన ప్రమాదం.. కొడుకుతో సహా ప్రాణాలతో బయటపడ్డ జెనీలియా
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
2018లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్‌గాంధీపై బీజేపీ నాయకుడు ప్రతాప్ కటియార్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. హత్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారైనా బీజేపీలో అధ్యక్షులు కావొచ్చని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ప్రతాప్ కటియార్ పిటిషన్‌లో పేర్కొ్న్నారు. ఈ మేరకు జూలై 9, 2018న చైబాసాలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. అనంతరం జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు పరువు నష్టం కేసును ఫిబ్రవరి 2020లో రాంచీలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు. తదనంతరం కేసును చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు తిరిగి పంపారు. మేజిస్ట్రేట్ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని రాహుల్‌గాంధీకి సమన్లుజారీ చేశారు.
ఇది కూడా చదవండి: KTR: నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును చేర్చడం తెలంగాణకే ఎంతో అవమానం
అయితే పదే పదే సమన్లు జారీ చేసినప్పటికీ రాహుల్ గాంధీ హాజరు కాలేదు. మొదట్లో బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడింది. ఆ తర్వాత వారెంట్‌పై స్టే కోరుతూ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను మార్చి 20, 2024న కొట్టివేసింది. తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం పిటిషన్ దాఖలు చేయగా.. దానిని చైబాసా కోర్టు కూడా తోసిపుచ్చింది. తాజాగా నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!