‘బొమ్మరిల్లు’ మూవీతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసి బ్యూటీ జెనీలియా. అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ హిందీలో కూడా పలు చిత్రాల్లో నటించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ని ప్రేమ వివాహం చేసుకోగా, ఆ జంటకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మూవీస్ విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే జెనిలీయ.. తన ఇద్దరు కొడుకులతో అప్పుడప్పుడు సరదాగా షికార్లకి వెళుతుంటుంది. వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయాని అభిమానులతో పంచుకుంటు ఉంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం జెనీలియా పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది.
Also Read : ‘Maa Inti Bangaram’ : జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న సమంత..
తన కుమారులతో బయటకి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లడానికి కారు ఎక్కుతుండగా.. ఆ సమయంలో డ్రైవర్ తొందరపాటుతో కాస్త ముందుకు పోనిచ్చాడు. లోపల ఉన్నవారు అరవడంతో కారుని ఆపేశారు. అదే కారు వేగంగా వెళ్లి ఉంటే జెనీలియాకి పెను ప్రమాదమే జరిగి ఉండేది. కారులో నుండి కింద పడి గాయలు అయ్యేవి. దేవుడి దయ వల్ల ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో నెటిజన్స్ డ్రైవర్ భయ్య కాస్త చూసుకొండి అంటూ.. అభిమానులు కూడా ఆమెకు జాగ్రత్తలు చెబుతున్నారు. ఇక ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జెనీలియా మంచి మంచి కథలు ఎంచుకుంటుంది. ఇటు రితేష్ కూడా విలన్ గా దూసుకుపోతున్నాడు.