Sheikh Hasina: షేక్ హసీనాకి యూకే షాక్ ఇవ్వబోతుందా.. ఆశ్రయం ఇచ్చేందుకు నిరాకరణ?
- షేక్ హసీనాకు యూకే ఆశ్రయం ఇవ్వబోవడం లేదా..?
- ఇప్పటికీ తేల్చని యూకే హోం డిపార్ట్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: అనూహ్య పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్ ప్రధానికి షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ దేశంలో విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఆమె ఇండియాకు చేరారు. ఇక్కడ నుంచి యూకేలో ఆశ్రయం పొందాలని భావిస్తున్నారు. అయితే, ఆమెకు శరణార్థిగా ఆశ్రయం ఇవ్వడం పట్ల యూకే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. సమాచారం ప్రకారం, ఆమెకు ఆశ్రయం ఇచ్చేందుకు యూకే నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.
షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడం పట్ల యూకే హోం ఆఫీస్ తర్జనభర్జన పడుతోంది. బ్రిటీష్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు వ్యక్తులకు ఆశ్రయం ఇచ్చేందుకు, తాత్కాలిక ఆశ్రయం పొందే వ్యక్తులు యూకేకి వచ్చేందుకు అనుమతించబని యూకే హోం ఆఫీస్ మంగళవారం చెప్పింది. ఇటీవల ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలిచి, కైర్ స్టార్మర్ ప్రధానిగా అయ్యారు. ఆ సమయంలో ఆశ్రయం కోరే వ్యక్తుల మొదట చేరుకునే సురక్షిత దేశం యూకే అని చెప్పారు. వ్యక్తులకు అవసరమైన రక్షణ కల్పించడంలో యూకేకి ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పారు. అయితే, ఆశ్రయం లేదా తాత్కాలిక శరణార్థిగా ఎవరైనా యూకేకి వెళ్లేందుకు అనుమతించే నిబంధనలు లేవు.
Also Read
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
76 ఏళ్ల షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ఆర్మీ 45 నిమిషాల అల్టిమేటం ఇచ్చిన తర్వాత ఆమె ఆ దేశ ఆర్మీ హెలికాప్టర్‌లో ఇండియా చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె భారత ఇంటెలిజెన్స్ సంస్థల ‘‘రక్షిత కస్టడీ’’లో ఉన్నట్లు తెలుస్తోంది. షేక్ హసీనా చెల్లెలు షేక్ రెహానాకు యూకే పౌరసత్వం ఉంది. ఆమె మేనకోడలు తులిప్ సిద్ధిక్ బ్రిటిస్ లేబర్ పార్లమెంటేరియన్. ఇది ఆమెకు ఉపయోగపడే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ బంగ్లాదేశ్ హింసపై ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో స్వతంత్ర విచారణ జరగా4లని కోరారు. బంగ్లాదేశ్‌కి శాంతియుత, ప్రజాస్వామ్య భవిష్యత్తు కోసం పిలుపునిచ్చారు. ఆ దేశంలో శాంతియుత, ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్ధారించేందుకు యూకే పనిచేస్తుందని చెప్పారు. అయితే, ఆయన షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
తాజావార్తలు
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..