Asaduddin Owaisi: హర్యానాలో గత నెలలో మత ఉద్రిక్తతలకు, అల్లర్లకు కారణమైన నూహ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఈ రోజు శోభాయాత్ర నిర్వహిస్తామని ప్రకటించడంతో నూహ్ తో పాటు మొత్తం హర్యానా హై అలర్ట్ అయింది. యాత్రకు అనుమతి లేకున్నా నిర్వహించేందుక వీహెచ్‌పీ ప్రయత్నిస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు నూహ్ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే హిందూ సంఘాలు ర్యాలీకి పిలుపునివ్వడాన్ని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నూహ్‌లో ధ్వంసమయ్యేలా ఏ ముస్లిం ఇళ్లు కూడా మిగలలేదు’ అని సోమవాారం వ్యాఖ్యానించారు.
Read Also: Nuh Rally: నూహ్‌లో ర్యాలీకి సిద్ధమైన హిందూ సంఘాలు.. హర్యానాలో హై అలర్ట్..
హర్యానాలో బీజేపీ ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేఖంగా వీహెచ్‌పీ పెద్ద ఊరేగింపును నిర్వహిస్తామని బెదిరిస్తోంది. అంతకుముందు నూహ్ హింస అందరికి తెలుసు. ఊరేగింపు సమయంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని ఎక్స్(ట్విట్టర్) ఆయన అన్నారు. కేవలం ముస్లింలపై ఏకపక్షంగా చర్యలు తీసుకుని, మిగతా వారిపై చర్యలు తీసుకోకపోవడంతోనే మరోసారి ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా వారు వెళ్లే సాహసం చేసేవారు కాదు అని ట్వీట్ చేశారు.
అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ ఓవైసీ విమర్శించారు. వీరి ముందు బీజేపీ నిస్సాహాయంగా ఉదని అనిపిస్తోందని, నూహ్‌లో మళ్లీ హింస చెలరేగితే హర్యానాలోని బిజెపి ప్రభుత్వం మాత్రమే బాధ్యత వహిస్తుందని, అక్కడ ధ్వంసం చేయడానికి ముస్లింల ఇల్లు లేవని ఆయన అన్నారు.
జూలై 31న నూహ్ ప్రాంతంలో శోభాయాత్ర మత ఘర్షణలకు కారణమైంది. ఈ ఘర్షణల్లో ఆరుగురు మరణించగా.. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ర్యాలీకి అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్ లపై నిషేధం విధించారు. విద్యాసంస్థలు, బ్యాంకులు మూతపడ్డాయి.
हरियाणा की भाजपा सरकार के आदेश के ख़िलाफ़ जाकर VHP शोभा यात्रा निकालने की धमकी दे रही है।
नूह की हिंसा से पहले सरकार को पता था कि यात्रा की आड़ में मुसलमानों को निशाना बनाया जाएगा। अगर मुसलमानों के ख़िलाफ़ एकतरफ़ा क़ानूनी कार्रवाई नहीं होती और असली मुजरिम को मोनू डार्लिंग न…
— Asaduddin Owaisi (@asadowaisi) August 28, 2023