F-35 Fighter Jets: అమెరికాకు చెందిన అత్యాధునిక, 5వ తరం ఫైటర్ జెట్ F-35 విమానాల కోనుగోలుపై అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని కేంద్రం లోక్‌సభకు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్రమోడీ వాషింగ్టన్ పర్యటన తర్వాత భారత్ ఈ విమానాలను కొనుగోలు చేయాలని అమెరికా ప్రతిపాదించింది.