India: మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూని గద్దె దించేందుకు భారత్ కుట్ర పన్నిందని, ముయిజ్జూని అభిశంసించేందుకు మాల్దీవుల ప్రతిపక్షాలు చేసిన విఫల కుట్రతో భారత్‌కి సంబంధం ఉందని ఇటీవల అమెరికా మీడియా నివేదించింది. ఈ నివేదికను భారత్ తీవ్రంగా తోసిపుచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం మాట్లాడుతూ.. ది వాషింగ్టన్ పోస్ట్ భారతదేశం పట్ల ‘‘నిర్బంధ శత్రుత్వం’’ కలిగి ఉందని ఆరోపించారు.
Read Also: Kerala political Murders: యూత్ కాంగ్రెస్ కార్యకర్తల హత్య.. 10 మందికి జీవిత ఖైదు..
వాషింగ్టన్ పోస్ట వార్తా పత్రిక, రిపోర్టర్లు భారతదేశం పట్ల శత్రుల్వాన్ని ప్రదర్శిస్తున్నారు. మీరు వారి కార్యకలాపాలను చూస్తే మీకే అర్థమవుతుందని, వారికి విశ్వసనీయత లేదని భారత్ తీవ్రంగా స్పందించింది. ‘డెమెక్రటిక్ రెన్యూవల్ ఇనిషియేటివ్’ అనే ఇంటర్నల్ డాక్యుమెంట్ ఆధారంగా ఈ రిపోర్టుని రూపొందించింది. ముయిజ్జుని తొలగించేందుకు ప్రతిపక్ష మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ(ఎండీపీ) భారత్‌ని 6 మిలియన్ డాలర్లనున కోరిందని ఆరోపించింది. ముయిజుని అభిశంసన ద్వారా తొలగించేందుకు, ముయిజ్జు పార్టీకి చెందిన కొంతమందితో సహా 40 మంది ఎంపీలకు లంచం ఇవ్వడానికి ప్రతిపక్షం ప్లాన్ చేసిందని, అయితే అది విఫలమైందని వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది.
మరోవైపు పాకిస్తాన్‌లో వరస హత్యల్లో భారత గూఢచారం సంస్థ ‘‘రా’’ ప్రమేయం ఉందని వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని కూడా భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్‌కి సంబంధించి గతంలో హిల్లరీ క్లింటన్ చేసిన వ్యాఖ్యల్ని భారత్ గుర్తు చేసింది. ‘‘మీరు పెరట్లో పాములు పెంచుకోలేరు. ఇవి పక్కవారిని కాటేయాలని ఆశించొద్దు, ఏదో రోజు అవి మిమ్మల్ని కూడా కాలేస్తాయి’’ అనే వ్యాఖ్యల్ని జైశ్వాల్ గుర్తు చేశారు. హిట్లరీ క్లింటన్ 2011లో అమెరికా విదేశాంగ మంత్రి హోదాలో పాకిస్తాన్ పర్యటనలో ఈ వ్యాఖ్యలు చేశారు.