Bihar Cabinet: నేడే బిహార్ మంత్రివర్గ విస్తరణ.. సింహభాగం ఆర్జేడీకే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Cabinet: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవాళ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని, కూటమి మిత్రపక్షమైన రాష్ట్రీయ జనతాదళ్‌కు అత్యధిక స్థానాలు రానున్నాయని పలు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఆర్జేడీకి 16 కేబినెట్ సీట్లు, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు 11మందికి చోటు దక్కే అవకాశం ఉంటుందని తెలిపాయి. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరికి, జితిన్ రామ్ మాంఝీకి చెందిన హెచ్ఏఎం(హిందుస్తానీ అవామ్ మోర్చా) నుంచి ఒకరికి, మరో స్వతంత్ర సభ్యుడికి కూడా మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశం ఉంది. బిహార్ కేబినెట్లో గరిష్టంగా 36 మంది మంత్రులు ఉండవచ్చు.
ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో ఈ వేడుక జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ ఆగస్టు 10న ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పార్టీ నుంచి గతంలో ఉన్న మంత్రుల్లో ఒకరిని మినహాయించి అందరినీ కొనసాగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మిత్రపక్షమైన ఆర్జేడీ నుంచి సీనియర్ నాయకులకు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇల్లు, ఆర్థిక, పన్నులు, రోడ్డు నిర్మాణం వంటి ప్లం పోర్ట్‌ఫోలియోలు ఎటువైపు వెళ్తాయో ఇంకా తెలియరాలేదు. గత ప్రభుత్వంలో నితీష్ కుమార్ హోంశాఖను ఆయనే నిర్వహించారు.
Also Read
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
Free Sanitary Products: మహిళలకు శానిటరీ ప్యాడ్లు ఉచితంగా అందిస్తున్న తొలిదేశం ఇదే..!!
మహాకూటమి ప్రభుత్వంలో తేజస్వీ యాదవ్‌కు ఆరోగ్యం, ఆర్థికం, రహదారుల నిర్మాణం వంటి శాఖలు అప్పగించవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ శాఖలు గతంలో బీజేపీకి సంబంధించిన నేతలు నిర్వహించారు. కొత్త ప్రభుత్వం వచ్చే వారం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఉంది.నితీష్ కుమార్ ఈ నెల ప్రారంభంలో బీజేపీ నుంచి విడిపోయి, ఆర్జేడీ,కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
2020 ఎన్నికల్లో తక్కువ సీట్లు రాగా.. బీజేపీతో కలిసి నితీష్‌కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. హోంమంత్రి అమిత్ షా తన పార్టీని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీతో పొత్తును రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శివసేన సీనియర్ నాయకుడు ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చివేసిన మహారాష్ట్ర మోడల్‌ను బీజేపీ పునరావృతం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన భావించినట్లు పలు వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
-
UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
-
Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్‌లో రెండో సెంచరీ నమోదు..
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!