బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మహాకూటమిలో భాగమైన వివిధ పార్టీల నుంచి మంగళవారం బిహార్ కేబినెట్‌లోకి మొత్తం 31 మంది మంత్రులుగా చేరారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవాళ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని, కూటమి మిత్రపక్షమైన రాష్ట్రీయ జనతాదళ్‌కు అత్యధిక స్థానాలు రానున్నాయని పలు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఆర్జేడీకి 16 కేబినెట్ సీట్లు, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు 11మందికి చోటు దక్కే అవకాశం ఉంటుందని తెలిపాయి.