PM Modi Manipur Visit: జాతి హింస కారణంగా రాష్ట్రం స్తంభించిపోయిన నేపథ్యంలో ప్రధాని మోడీ మణిపూర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంఫాల్‌కు వచ్చిన ప్రధానిని పలువురు స్థానికులు, విద్యార్థులు కలిసి మాట్లాడారు. ఈసందర్భంగా పలువురు ప్రధాని సమక్షంలోనే కంటతడి పెట్టుకున్నారు. గత రెండు ఏళ్లుగా ప్రజల జీవితాలు ఎంత అల్లకల్లోలంగా ఉన్నాయో వారు ప్రధానికి వివరించారు.
READ ALSO: Anurag Thakur: “మనం ఆపలేం”..! భారత్- పాక్ మ్యాచ్‌పై మాజీ క్రీడా మంత్రి రియాక్షన్..
అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. చురచంద్‌పూర్‌లో రూ.7,300 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు, ఇంఫాల్‌లో రూ.1,200 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. చురచంద్‌పూర్‌లోని పీస్ గ్రౌండ్‌లో ప్రధాని మాట్లాడుతూ.. సహాయ శిబిరాల్లో నివసిస్తున్న వారిని కలవడాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. మణిపూర్‌లో అభివృద్ధికి శాంతి తప్పనిసరి అని అన్నారు. నిరాశ్రయులైన వారి కోసం 7,000 కు పైగా కొత్త ఇళ్లు నిర్మిస్తున్నామని, మణిపూర్‌లో సాధారణ స్థితిని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
మణిపూర్‌లో కనెక్టివిటీ విస్తరించడం గురించి ప్రధాని మాట్లాడుతూ.. “మేము రెండు అంశాల మీద పనిచేశాము. రైలు, రోడ్డు కోసం బడ్జెట్ పెంచాము. గ్రామీణ రోడ్లను నిర్మించాము. మణిపూర్‌లో జాతీయ రహదారులపై రూ. 3700 కోట్లు ఖర్చు చేశాము. గతంలో గ్రామాలకు చేరుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు చాలా గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ ఉంది” అని ప్రధాని అన్నారు. మణిపూర్‌లో రైలు కనెక్టివిటీని కూడా విస్తరిస్తున్నామని, ఇంఫాల్‌ను త్వరలో జాతీయ రైలు నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేయనున్నట్లు తెలిపారు.
READ ALSO: Maoist Sujathakka: జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు సుజాతక్క.. 43 ఏళ్ల అజ్ఞాత జీవితానికి ముగింపు..